రాజస్థాన్లో స్కూళ్లకు అమరవీరుల పేర్లు!
రాజస్థాన్ ప్రభుత్వం, దేశంకోసం ప్రాణాలను అర్పించిన అమరజవాన్ల విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంది. వారి పేర్లను ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు పెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రప్రభుత్వం గతంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా అది అమల్లోకి రాలేదు. శుక్రవారం అక్కడి అసెంబ్లీలో ఓ కాంగ్రెస్ శాసనసభ్యుడు అడిగిన ప్రశ్నకు సైనిక సంక్షేమ శాఖా మంత్రి కాళీ చరణ్ సరాఫ్ సమాధానం చెబుతూ వివరణ ఇచ్చారు. 151మంది అమరజవాన్ల పేర్లను విద్యా శాఖకు పంపామని, స్కూళ్లకు వారిపేర్లను పెట్టే […]
రాజస్థాన్ ప్రభుత్వం, దేశంకోసం ప్రాణాలను అర్పించిన అమరజవాన్ల విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంది. వారి పేర్లను ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు పెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రప్రభుత్వం గతంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా అది అమల్లోకి రాలేదు. శుక్రవారం అక్కడి అసెంబ్లీలో ఓ కాంగ్రెస్ శాసనసభ్యుడు అడిగిన ప్రశ్నకు సైనిక సంక్షేమ శాఖా మంత్రి కాళీ చరణ్ సరాఫ్ సమాధానం చెబుతూ వివరణ ఇచ్చారు. 151మంది అమరజవాన్ల పేర్లను విద్యా శాఖకు పంపామని, స్కూళ్లకు వారిపేర్లను పెట్టే కార్యక్రమం త్వరలో మొదలవుతుందని తెలిపారు.