నాగచైతన్య ఖాతాలో నాలుగో దర్శకుడు
ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సాహసం శ్వాసగా సాగిపో అనే సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. మరోవైపు చందు మొండేటి దర్శకత్వంలో ప్రేమమ్ సినిమా రీమేక్ ను తెరకెక్కిస్తున్నాడు. ఇక త్వరలోనే సోగ్గాడే చిన్ని నాయనా దర్శకుడు కల్యాణ్ కృష్ణతో మరో సినిమాను కూడా చేయబోతున్నాడనే వార్త అన్నపూర్ణ స్టుడియోస్ నుంచి అధికారికంగా వచ్చింది. ఇప్పుడీ ముగ్గురు దర్శకులకు తోడు నాగచైతన్య ఖాతాలో నాలుగో దర్శకుడు కూడా చేరాడు. విలక్షణ సినిమాల సృష్టికర్త సెల్వరాఘవన్… నాగచైతన్య కోసం ఓ […]
BY admin12 March 2016 7:29 AM IST

X
admin Updated On: 12 March 2016 10:09 AM IST
ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సాహసం శ్వాసగా సాగిపో అనే సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. మరోవైపు చందు మొండేటి దర్శకత్వంలో ప్రేమమ్ సినిమా రీమేక్ ను తెరకెక్కిస్తున్నాడు. ఇక త్వరలోనే సోగ్గాడే చిన్ని నాయనా దర్శకుడు కల్యాణ్ కృష్ణతో మరో సినిమాను కూడా చేయబోతున్నాడనే వార్త అన్నపూర్ణ స్టుడియోస్ నుంచి అధికారికంగా వచ్చింది. ఇప్పుడీ ముగ్గురు దర్శకులకు తోడు నాగచైతన్య ఖాతాలో నాలుగో దర్శకుడు కూడా చేరాడు. విలక్షణ సినిమాల సృష్టికర్త సెల్వరాఘవన్… నాగచైతన్య కోసం ఓ కథ సిద్ధంచేశాడట. ఆ కథను నాగచైతన్యకు కూడా వినిపించాడు. కథ నచ్చడంతో… వెంటనే సెల్వరాఘవన్ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలనుకుంటున్నాడు చైతూ. అయితే ప్రేమమ్ తర్వాత కల్యాణ్ కృష్ణకు అవకాశం ఇవ్వాలా…. లేక సెల్వకు ఛాన్స్ ఇవ్వాలా అనే సందిగ్దంలో పడిపోయాడు. త్వరలోనే నాగచైతన్య నాలుగో దర్శకుడిపై ఓ క్లారిటీ వస్తుంది.
Next Story