రోహిత్ వేములపై కలెక్టర్ ఫేస్‌బుక్ షేర్స్...... డిలీట్ చేయించారు!
సివిల్ సర్వీసెస్ ఉద్యోగం నుండి క్లాస్ ఫోర్ వరకు..ఏ ఉద్యోగంలో ఉన్నా వారు ప్రజలకోసం పనిచేస్తున్నారనే అంటాం. కానీ వారిమీద పెత్తనం మాత్రం ప్రభుత్వాలకు, వాటిని నడిపించే రాజకీయ పార్టీలకు ఉంటుంది. ఉత్తర ప్రదేశ్, బలరాంపూర్ జిల్లా కలెక్టర్ విషయంలో అలాగే జరిగింది. అలెక్స్‌పాల్ మీనన్ అనే ఈ ఐఎఎస్ అధికారి, జెఎన్‌యు విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ స్కాలర్ రోహిత్ వేముల…వీరిద్దరిపై వచ్చిన 12 ఆర్టకల్స్‌ని తన ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. […]
సివిల్ సర్వీసెస్ ఉద్యోగం నుండి క్లాస్ ఫోర్ వరకు..ఏ ఉద్యోగంలో ఉన్నా వారు ప్రజలకోసం పనిచేస్తున్నారనే అంటాం. కానీ వారిమీద పెత్తనం మాత్రం ప్రభుత్వాలకు, వాటిని నడిపించే రాజకీయ పార్టీలకు ఉంటుంది. ఉత్తర ప్రదేశ్, బలరాంపూర్ జిల్లా కలెక్టర్ విషయంలో అలాగే జరిగింది. అలెక్స్‌పాల్ మీనన్ అనే ఈ ఐఎఎస్ అధికారి, జెఎన్‌యు విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ స్కాలర్ రోహిత్ వేముల…వీరిద్దరిపై వచ్చిన 12 ఆర్టకల్స్‌ని తన ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. దాంతో ఒక ప్రభుత్వ సర్వెంట్ అయి వుండి అలాంటి పోస్ట్‌లు ప్రోత్సహిస్తారా …అనే ఆగ్రహానికి ఆయన గురికావాల్సి వచ్చింది. ఇతర ప్రభుత్వ అధికారులు, బిజెపి పార్టీ వర్గాలు కలిసి ఆయన ఆ పోస్ట్‌లను ఉపసంహరించుకునేలా చేశారు. మీనన్ 2012 మేలో 12 రోజులపాటు మావోయిస్టుల వద్ద బందీగా ఉన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన చత్తీస్‌గఢ్‌లో ఆయన తన విధులను అత్యంత సమర్ధవంతంగా నిర్వహించారు.
మీనన్, ఫేస్‌బుక్‌లో ఆర్టికల్స్‌ని షేర్ చేయడంతో పాటు ట్విట్టర్లో ఆ ఇద్దరు యువకుల భావాలకు తన సంఘీభావాన్ని తెలిపారు. అయితే పోస్టులను తీసేసిన అనంతరం ఆయన స్పందిస్తూ, తాను ప్రభుత్వ సర్వెంట్‌నని, ప్రభుత్వానికి విధేయుడిగానే ఉంటానని, ఆపోస్టులు వారిద్దరికీ మద్దతు ప్రకటించడం కాదని, కేవలం వాటిని తాను షేర్ చేశానని చెప్పారు. గతనెలలో ఇదే రాష్ట్రంలో బస్తర్‌జిల్లా కలెక్టర్ అమిత్ కఠారియాకి కూడా ఇలాంటి సంఘర్షణే ఎదురైంది. గిరిజన హక్కుల కార్యకర్త సోనీ సోరిపై జరిగిన దాడిని గురించి కఠారియా ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌ని కూడా ఆయన ఇతరుల బలవంతం కారణంగా తొలగించాల్సివచ్చింది.