Telugu Global
Cinema & Entertainment

అల్ల‌రి న‌రేష్ కు చిక్కిన విజ‌య్ మాల్యా?

ప్ర‌స్తుతం టాక్ ఆఫ్ కంట్రీ అంటే విజ‌య్ మాల్యా అనే చెప్పాలి. దాదాపు 9 వేల కోట్ల వ‌ర‌కు బ్యాంకులకు బ‌కాయి ప‌డి.. విదేశాల‌కు చెక్కేసిన‌ మాల్యా కోసం ప్ర‌స్తుతం చాలా బ్యాంకులు వెతుకుతున్నాయి. అయితే మాల్యా మాత్రం త‌ను ఎక్క‌డ వున్న‌ది చెప్ప‌కుండా..సామాజిక మాధ్య‌మాల ద్వారా మాత్రం మీడియ పై సెటైర్స్ వేస్తున్నారు. ఇదిలా వుంటే బ్యాంకుల‌కు దొర‌క‌ని విజ‌య్ మాల్యా మ‌న హీరో అల్ల‌రి న‌రేష్ కు చిక్క‌డం విశేషం. న‌రేష్ కు ఎలా […]

అల్ల‌రి న‌రేష్ కు చిక్కిన విజ‌య్ మాల్యా?
X

ప్ర‌స్తుతం టాక్ ఆఫ్ కంట్రీ అంటే విజ‌య్ మాల్యా అనే చెప్పాలి. దాదాపు 9 వేల కోట్ల వ‌ర‌కు బ్యాంకులకు బ‌కాయి ప‌డి.. విదేశాల‌కు చెక్కేసిన‌ మాల్యా కోసం ప్ర‌స్తుతం చాలా బ్యాంకులు వెతుకుతున్నాయి. అయితే మాల్యా మాత్రం త‌ను ఎక్క‌డ వున్న‌ది చెప్ప‌కుండా..సామాజిక మాధ్య‌మాల ద్వారా మాత్రం మీడియ పై సెటైర్స్ వేస్తున్నారు. ఇదిలా వుంటే బ్యాంకుల‌కు దొర‌క‌ని విజ‌య్ మాల్యా మ‌న హీరో అల్ల‌రి న‌రేష్ కు చిక్క‌డం విశేషం. న‌రేష్ కు ఎలా చిక్కాడు అనే సందేహాం వ‌ద్దండోయ్. ఆ మ‌ధ్య ఎప్పుడో షూటింగ్ నిమిత్తం ఏదో విమాన‌శ్ర‌యంలో విదేశాల‌కు వెళ్తే మాల్యా క‌నిపించార‌ట‌. ఆయ‌ను అడిగి నరేష్ ఆయ‌న‌తో సెల్ఫీ తీసుకున్నార‌ట‌. అది ఈ రోజు సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో పోస్ట్ చేసి.. బ్యాంకుల‌కు దొర‌క‌ని మాల్యా నాకు చిక్కాడు అంటూ స‌ర‌ద‌గా ఒక కామెంట్ పోస్ట్ చేశారు. ఆన్ స్క్రీన్ మీదే కాదు.. ఆఫ్ లైన్ లో కూడా మ‌న అల్ల‌రోడు అప్పుడ‌ప్పుడు ఇలా హాస్యం పంచుతున్నాడ‌న్న‌మాట‌.

First Published:  12 March 2016 10:26 AM IST
Next Story