Telugu Global
NEWS

‘’నేనే లేకుంటే…’’ " కేసీఆర్ కేబినెట్ పై కడియం కామెంట్స్

వరంగల్ టీఆర్ఎస్‌లో నేతలు ఎక్కవైపోయే సరికి తోపులాట మొదలైంది. భిన్న ధృవాల్లాంటి కడియం, కొండా దంపతులు, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇప్పుడు ఒకే కారులో ప్రయాణిస్తున్నారు. ఇటీవల ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత మంత్రి మండలి మార్పులు చేర్పులపైనా చర్చ మొదలైంది. కడియంను డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించి శాసనమండలి చైర్మన్‌గా నియమిస్తారని కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది.  స్వామిగౌడ్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారని ప్రచారం. అదే సమయంలో కడియంకు సొంతపార్టీ ప్రత్యర్థులుగా ఉన్న కొండా సురేఖకు మంత్రి పదవి, […]

‘’నేనే లేకుంటే…’’  కేసీఆర్ కేబినెట్ పై కడియం కామెంట్స్
X

వరంగల్ టీఆర్ఎస్‌లో నేతలు ఎక్కవైపోయే సరికి తోపులాట మొదలైంది. భిన్న ధృవాల్లాంటి కడియం, కొండా దంపతులు, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇప్పుడు ఒకే కారులో ప్రయాణిస్తున్నారు. ఇటీవల ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత మంత్రి మండలి మార్పులు చేర్పులపైనా చర్చ మొదలైంది.

కడియంను డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించి శాసనమండలి చైర్మన్‌గా నియమిస్తారని కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. స్వామిగౌడ్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారని ప్రచారం. అదే సమయంలో కడియంకు సొంతపార్టీ ప్రత్యర్థులుగా ఉన్న కొండా సురేఖకు మంత్రి పదవి, ఎర్రబెల్లికి చీఫ్ విప్ పదవి ఇస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎటొచ్చి వరంగల్‌ జిల్లాలో కడియం శ్రీహరికి డిమోషన్ తప్పదంటున్నారు. ఈనేపథ్యంలో కడియం స్పందించారు.

సాధారణంగా ఇలాంటి పరిస్థితిలో నేతలెవరైనా అంతా ముఖ్యమంత్రి ఇష్టం అని తప్పించుకుంటారు. కానీ కడియం మాత్రం అందుకు భిన్నంగానే స్పందించారు. తనను మంత్రివర్గం నుంచి తప్పించే పరిస్థితి లేదన్నారు. పైగా కేబినెట్‌కు ఒక రూపం వచ్చిందంటే అది తన వల్లనేనని చెప్పారు. తన ఉప ముఖ్యమంత్రి పదవి పోయి ,కౌన్సిల్ చైర్మన్ అవుతారన్న ప్రచారాన్ని ఖండించారు. కడియం ఈ రేంజ్‌లో రియాక్టవడంపై టీఆర్‌ఎస్ నాయకులే ఆశ్చర్యపోతున్నారు.

తన వల్లే కేబినెట్‌కు ఒక రూపం వచ్చిందని కడియం అనకుండా ఉండాల్సింది అంటున్నారు. ఈ వ్యాఖ్యలు కేసీఆర్‌కు మరింత కోపం తెప్పిస్తాయని గుర్తు చేస్తున్నారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక సమయంలోనూ కడియం ఇలాగే వ్యవహరించారని అందుకే ఆ సమయంలో ఎన్నికల బాధ్యతలకు ఆయన్ను దూరంగా ఉంచారని గుర్తు చేస్తున్నారు. నిజమే.. తను లేకుంటే కేబినెట్‌కు రూపమే లేదన్నట్టుగా కడియం మాట్లాడడం ఇబ్బందికర పరిణామమే.

Click on Image to Read:

bjp-president

roja1

photo

jagan-case-involved

123

bandla-ganesh

kottapalli-geetha

jagan-smile-in-assembly

ys-chandrababu

babu-raithu

srimannarayana-green-tribun

polavaram-chandrababu

ttdp

jagan

bjp-tdp

ysrcp-tdp

First Published:  11 March 2016 1:37 AM GMT
Next Story