వద్దు వద్దు.. సీఎం స్ర్కోలింగులు చూస్తే పనికాదు…
నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ భవిష్యత్తుపై భారీ అంచనాలతోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. వీలైతే 2019నాటికి పార్టీ పగ్గాలను అందుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాము రెస్ట్ లో ఉన్నామని 2018 నుంచి రంగంలోకి దిగుతామన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. కనీసం 95 స్థానాలను గెలుచుకుంటామని మీడియా ప్రతినిధులతో చెప్పారు. వెంకటరెడ్డి వ్యాఖ్యలు ఆసక్తిగా ఉండడంతో […]
నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ భవిష్యత్తుపై భారీ అంచనాలతోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. వీలైతే 2019నాటికి పార్టీ పగ్గాలను అందుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం తాము రెస్ట్ లో ఉన్నామని 2018 నుంచి రంగంలోకి దిగుతామన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. కనీసం 95 స్థానాలను గెలుచుకుంటామని మీడియా ప్రతినిధులతో చెప్పారు. వెంకటరెడ్డి వ్యాఖ్యలు ఆసక్తిగా ఉండడంతో మీడియా ప్రతినిధులు ''2019లో కాంగ్రెస్‌దే అధికారం అంటున్న వెంకటరెడ్డి అని టీవీల్లో స్ర్కోలింగ్ వేసుకోవచ్చా'' అని అడిగారు. వెంటనే స్పందించిన కోమటిరెడ్డి "వద్దు వద్దు ఆ పని మాత్రం చేయవద్దు… సీఎంఆర్‌ఎఫ్ పనిమీద సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్తున్నా… స్ర్కోలింగ్‌ను సీఎం చూస్తే పని జరగదు" అని మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ తరహాలోనే గతంలో కేసీఆర్ నుంచి ఎదురైన అనుభావాన్ని వివరించారు కోమటిరెడ్డి .
''గతంలో బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పనిమీద పోయి పనులు మొదలు పెట్టాలని కోరితే అప్పటికప్పుడే ఈఎన్‌సీకి ఫోన్‌చేసి సీఎం చెప్పారు. పనులు కూడా మొదలయ్యాయి. కానీ, ఆ తర్వాత ఓ రోజు ఏదో ఒక సమావేశంలో సీఎం కేసీఆర్‌ను విమర్శించా. అంతే తెల్లారేసరికి బ్రాహ్మణవెల్లెంల పనులు నిలిచిపోయాయి" అంటూ వివరించారు. అయితే ఈ విషయాన్ని టీవీల్లో వేయవద్దని కోమటిరెడ్డి కోరినా … వార్త మాత్రం తెరపైకి ఎక్కిపోయింది. మీడియాకు ఒక్కసారి ఉప్పందించాక ఇక ఆగడమంటూ ఉండదు సర్…!
Click on Image to Read: