ఎవరు ఎవరికి తోక.. తేల్చిన వరంగల్ ప్రజలు
తెలంగాణలో టీడీపీతో పొత్తు వల్లే బీజేపీ బలపడడం లేదన్న వాదనను చాలాకాలంగా కమలనాథులు వినిపిస్తున్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం అందుకు రివర్స్‌లో ప్రచారం చేస్తూ వచ్చారు. టీడీపీ లేకపోతే బీజేపీకి కనీస స్థాయిలో కూడా ఓట్లు రావని నమ్మించారు. టీడీపీకి బీజేపీ తోక పార్టీగా ఉంటేనే మంచిదన్న భావన కలిగించారు. అయితే తెలంగాణలో కీలకమైన వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరు ఎవరికి తోక పార్టీ అన్నది జనం తేల్చేశారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా […]
తెలంగాణలో టీడీపీతో పొత్తు వల్లే బీజేపీ బలపడడం లేదన్న వాదనను చాలాకాలంగా కమలనాథులు వినిపిస్తున్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం అందుకు రివర్స్‌లో ప్రచారం చేస్తూ వచ్చారు. టీడీపీ లేకపోతే బీజేపీకి కనీస స్థాయిలో కూడా ఓట్లు రావని నమ్మించారు. టీడీపీకి బీజేపీ తోక పార్టీగా ఉంటేనే మంచిదన్న భావన కలిగించారు. అయితే తెలంగాణలో కీలకమైన వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరు ఎవరికి తోక పార్టీ అన్నది జనం తేల్చేశారు.
వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. పార్టీ చరిత్రలో ఇంత దారుణమైన ఓటమి ఎన్నడూ లేదు. 52 డివిజన్లలో టీడీపీ పోటి చేయగా మొత్తం కలిపి కేవలం 9,091 ఓట్లు అంటే కేవలం 2. 34 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఒక్క చోట మాత్రమే డిపాజిట్ దక్కింది. 51 డివిజన్లలో వంద లోపు ఓట్లే టీడీపీకి పోలయ్యాయి. ఈసారి టీడీపీతో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలో దిగిన బీజేపీ ఊహించని స్థాయిలో ఓట్లు సంపాదించింది.
టీడీపీకి 9,091 ఓట్లు రాగా ఒంటిరిగా బరిలో దిగిన బీజేపీకి ఏకంగా 48 వేల 513 ఓట్లు వచ్చాయి. ఇది 12. 5 శాతం ఓట్లు. కాంగ్రెస్‌కు 53000 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల ద్వారా ఒంటరిగా వెళ్తేనే బీజేపీకి భవిష్యత్తు ఉంటుందన్న సూచనను వరంగల్ ప్రజలు చేసినట్టుగా అయింది. అదే సమయంలో టీడీపీ భవిష్యత్తు ఆశలపై నీళ్లు చల్లేశారు ఓరుగల్లు జనం.
Click on image to read: