దీక్షపై వెనక్కు తగ్గిన ముద్రగడ
కాపుల డిమాండ్లపై ఈనెల 11 నుంచి అమరణ దీక్షకు దిగుతానని ప్రకటించిన కాపు ఉద్యమ నేత ముద్రగడ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. దీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. విద్యార్థుల పరీక్షల దృష్ట్యా దీక్షను వాయిదా వేస్తున్నట్టు ముద్రగడ చెప్పారు. రెండు మూడు నెలల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. తమ జాతి కోసం విద్యార్థులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముద్రగడ చెప్పారు. కాపులను అరెస్ట్ చేయడం, వేధించడం చేస్తే రోడ్డెక్కుతామని హెచ్చరించారు. అన్ని […]

కాపుల డిమాండ్లపై ఈనెల 11 నుంచి అమరణ దీక్షకు దిగుతానని ప్రకటించిన కాపు ఉద్యమ నేత ముద్రగడ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. దీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. విద్యార్థుల పరీక్షల దృష్ట్యా దీక్షను వాయిదా వేస్తున్నట్టు ముద్రగడ చెప్పారు. రెండు మూడు నెలల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. తమ జాతి కోసం విద్యార్థులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముద్రగడ చెప్పారు. కాపులను అరెస్ట్ చేయడం, వేధించడం చేస్తే రోడ్డెక్కుతామని హెచ్చరించారు. అన్ని కులాల వారు తమ ఉద్యమానికి మద్దతు ఇచ్చారని ఆయన అన్నారు.
Click on image to read: