జారిపోతున్న జాతీయ పార్టీ...సైకిల్ కన్నా ఫ్యాన్‌కే అధిక ఓట్లు
తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్రాలలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా రాజకీయాలు చేసిన పార్టీ. అలాంటి పార్టీకి ఇప్పటి పరిస్థితులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మొన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనే కాదు నిన్న జరిగిన వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పార్టీ కుప్పకూలింది.ఆ పార్టీ స్థాపించిన దగ్గరనుంచి ఎన్నడూ లేనివిధంగా సంక్షోభంలో చిక్కుకుంది. గ్రేటర్ హైదరాబాద్ లో తమకు తిరుగులేని బలం ఉంది అని చెప్పుకున్న టీడీపీ అక్కడ సింగిల్ రన్‌తో సరిపెట్టుకోవాల్సి […]
తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్రాలలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా రాజకీయాలు చేసిన పార్టీ. అలాంటి పార్టీకి ఇప్పటి పరిస్థితులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మొన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనే కాదు నిన్న జరిగిన వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పార్టీ కుప్పకూలింది.ఆ పార్టీ స్థాపించిన దగ్గరనుంచి ఎన్నడూ లేనివిధంగా సంక్షోభంలో చిక్కుకుంది.
గ్రేటర్ హైదరాబాద్ లో తమకు తిరుగులేని బలం ఉంది అని చెప్పుకున్న టీడీపీ అక్కడ సింగిల్ రన్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన నారాయణఖేడ్, వరంగల్ ఉప ఎన్నికల్లో కూడా డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వరంగల్, ఖమ్మం జిల్లాలలో ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవలేక చతికిలపడింది. టీడీపీకి ఖమ్మం కార్పొరేషన్ లో కేవలం 15,292 ఓట్లు మాత్రమే వచ్చాయి.మొత్తం 50 డివిజన్లకు గాను 40 డివిజన్లలో టీడీపీ పోటీ చేసింది. 40 డివిజన్లలోనూ డిపాజిట్లు కోల్పోయింది. 47వ డివిజన్‌లో కేవలం 4 ఓట్లు మాత్రమే సైకిల్ గుర్తుకు పడ్డాయి.
తమది జాతీయ పార్టీగా భావించే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ ఫలితాలతో ఖంగు తిన్నారు. తెలుగుదేశం పార్టీ 2014 సాధారణ ఎన్నికలలో పొందిన ఓట్ల శాతం 34.88 కాగా ఇప్పుడు అది 8.4 శాతానికి పడిపోయింది. ఇంత తక్కువ సమయంలోనే ఏకంగా34.88 శాతం నుంచి 8.4 శాతానికి ఓటుబ్యాంకు పడిపోవడాన్ని చూసి టీడీపీ తన మూలాలని కోల్పోయిందని చాలామంది భావిస్తున్నారు.
ఇదే సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఖమ్మం కార్పొరేషన్‌లో టీడీపీకన్నా ఎక్కువ ఓట్లు సాధించడం గమనార్హం. వైసీపీకి 10.76శాతం ఓట్లు ( 19,440 ఓట్లు) పోలయ్యాయి. టీడీపీ ఒక్కస్థానాన్ని కూడా గెలుచుకోలేకపోగా వైసీపీ మాత్రం రెండు స్థానాలను గెలుచుకుంది. మొత్తం మీద ఈ ఓట్ల శాతాన్ని బట్టి మొన్నటి సాధారణ ఎన్నికలకంటే టీడీపీ శరవేగంగా బలహీనపడుతుందని అర్థమౌతుంది.
Click on image to read: