జగన్ చెప్పింది నిజమే- విష్ణు, జగన్ ఊరిలో సన్మానం చేయించుకుంటా- ఉమ
గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా పోలవరం అంశాన్ని జగన్ ప్రధానంగా ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు పనులను నత్తనడకగా సాగిస్తున్నారని ఆరోపించారు. విఫలమైన కాంట్రాక్టర్‌ను తొలగించాల్సింది పోయి అదనంగా ఎస్కలేషన్ మొత్తాన్ని చెల్లించేందుకు ఎందుకు సిద్ధపడ్డారని ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌లో అవినీతి దెబ్బకు ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సంతకాలు చేసేందుకు కూడా జంకారని గుర్తు చేశారు. అయితే జగన్ వ్యాఖ్యలపై మంత్రి దేవినేని ఉమ ఎదురు దాడికి దిగారు. పోలవరంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని […]
గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా పోలవరం అంశాన్ని జగన్ ప్రధానంగా ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు పనులను నత్తనడకగా సాగిస్తున్నారని ఆరోపించారు. విఫలమైన కాంట్రాక్టర్‌ను తొలగించాల్సింది పోయి అదనంగా ఎస్కలేషన్ మొత్తాన్ని చెల్లించేందుకు ఎందుకు సిద్ధపడ్డారని ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌లో అవినీతి దెబ్బకు ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సంతకాలు చేసేందుకు కూడా జంకారని గుర్తు చేశారు. అయితే జగన్ వ్యాఖ్యలపై మంత్రి దేవినేని ఉమ ఎదురు దాడికి దిగారు.
పోలవరంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పోలవరం పరుగులు తీస్తోందంటూ వారం క్రితం సాక్షి టీవీ మినహా మిగిలిన తెలుగు టీవీ చానళ్లు అన్ని అర గంటపాటు భారీ కథనాన్ని ప్రసారం చేశాయని చెప్పారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేసి… రాయలసీమకు కూడా నీరు ఇస్తామని, ఈ విషయం రాసిపెట్టుకోవాలని ఉమ చెప్పారు. రాయలసీమకు నీరు ఇచ్చి జగన్ సొంతూరులో సన్మానం చేయించుకుంటానని దేవినేని ఉమ శపథం చేశారు. అయితే దేవినేని ఉమ వ్యాఖ్యలకు బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు అభ్యంతరం తెలిపారు.
జగన్ అడిగిన దానిలో అర్థముందని దాని సమాధానం చెప్పకుండా మంత్రి ఏవేవో చెబితే ఎలా అని ప్రశ్నించారు. ఒక చేత గాని కాంట్రాక్టర్ పోలవరం ప్రాజెక్ట్ కట్టలేకపోతుంటే ఎస్కలేషన్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. తాను కూడా కాంట్రాక్టర్‌నేనని ఇలా చేయడం ఎక్కడా చూడలేదన్నారు. మూడేళ్లలో పని చేస్తానని చెప్పి చేయలేకపోయిన చేత కాని కాంట్రాక్టర్‌ను తొలగించాల్సిందిపోయి అదనపు చెల్లింపులు ఏమిటని ప్రశ్నించారు. దీనికి మంత్రి సూటిగా సమాధానం చెప్పాలన్నారు. కానీ దేవినేని ఉమ ఎస్కలేషన్‌పై సమాధానం చెప్పకుండా ఎదురుదాడే చేశారు. రాసి పెట్టుకోవాలని 2018నాటికి పోలవరం పూర్తి చేసి జగన్ సొంతూరులో సన్మానం చేసుకుంటానని మరోసారి చెప్పారు.
Click on image to read: