ముంబయిలో బిజీబిజీగా ఎన్టీఆర్
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజీ సెట్స్ పైకి ఎన్టీఆర్ వెళ్లిపోయాడు. మొన్నటివరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజాగా ముంబయికి షిఫ్ట్ అయింది. అక్కడే 12 రోజుల పాటు షూటింగ్ ఉంటుంది. ఈ షెడ్యూల్ కు ఎన్టీఆర్ హాజరయ్యారు. కొరటాల శివ దర్శకత్వంలో కీలకమైన కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నాడు. సినిమా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఆ సన్నివేశాల కోసం మోహన్ లాల్ తో కలిసి ఎన్టీఆర్ తొలిసారిగా కెమెరా […]
BY admin9 March 2016 5:51 AM IST
X
admin Updated On: 9 March 2016 10:41 AM IST
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజీ సెట్స్ పైకి ఎన్టీఆర్ వెళ్లిపోయాడు. మొన్నటివరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజాగా ముంబయికి షిఫ్ట్ అయింది. అక్కడే 12 రోజుల పాటు షూటింగ్ ఉంటుంది. ఈ షెడ్యూల్ కు ఎన్టీఆర్ హాజరయ్యారు. కొరటాల శివ దర్శకత్వంలో కీలకమైన కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నాడు. సినిమా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఆ సన్నివేశాల కోసం మోహన్ లాల్ తో కలిసి ఎన్టీఆర్ తొలిసారిగా కెమెరా ముందుకొచ్చాడు. ఈ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని యూనిట్ భావిస్తోంది. ఫస్ట్ లుక్ ను కూడా మోహన్ లాల్-ఎన్టీఆర్ కలిసి నటించిన ఫొటోలతోనే విడుదల చేయాలని భావిస్తున్నారట. మరోవైపు ఈ మూవీలో ఎన్టీఆర్ కు సంబంధించి ఎలాంటి మేకోవర్స్ ఉండవని, రెగ్యులర్ గానే కనిపిస్తాడని దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు. సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Next Story