Telugu Global
NEWS

ఈ డబ్బాను చూసే భయమేస్తోంది

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రభుత్వం తీరును ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుపట్టారు.  చంద్రబాబు వైఖరి వల్లే రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.  రాష్ట్రాల్లో బీద ఏడుపులు ఏడ్చే చంద్రబాబు… ఢిల్లీ వెళ్లినప్పుడు మాత్రం గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.  అసలు చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదన్నారు.  ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్టుగా ఉందన్నారు. విశాఖలో […]

ఈ డబ్బాను చూసే భయమేస్తోంది
X

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రభుత్వం తీరును ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు వైఖరి వల్లే రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల్లో బీద ఏడుపులు ఏడ్చే చంద్రబాబు… ఢిల్లీ వెళ్లినప్పుడు మాత్రం గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అసలు చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్టుగా ఉందన్నారు.

విశాఖలో పారిశ్రామిక సదస్సు పెట్టిన చంద్రబాబు ఏకంగా రూ. 4 లక్షల 67 వేల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయని పదేపదే డబ్బాకొడుతున్నారని దీని వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. అరడజను మంది కేంద్ర మంత్రులను తీసుకొచ్చి లక్ష కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెబితే ఇక కేంద్రం ఎలా సాయం చేస్తుందని ప్రశ్నించారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకన్న భావన కలిగే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి చంద్రబాబు ఇలా డబ్బా కొట్టుకోవడం మానుకోవాలని సూచించారు. చంద్రబాబు సీఎం అయి రెండేళ్లు అవుతున్నా అమరావతిలో ఒక్క ఇటుక కూడా వేయలేదని .. ఎందుకు ఇలా చేస్తున్నారని నిలదీశారు.

కేంద్రం వరసగా మూడు బడ్జెట్‌లలో ఏపీకి అన్యాయం చేశాక కూడా కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ఎందుకు అల్టిమేటం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ రెండేళ్లలో వెయ్యి కోట్ల విలువైన ప్రాజెక్ట్ ఒక్కటైనా వచ్చిందా అని నిలదీశారు. హీరో మోటర్ ప్లాంట్, ఏసియన్ పెయింట్ ప్లాంట్‌లు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలన్నారు. విశాఖలో కనీసం ఒక్క ఐటీ కంపెనీని స్థాపించగలిగారా అని నిలదీశారు. ఏడాదికి మూడు వేల కోట్లకు మించి పెట్టుబడులు రావడం లేదని ప్రభుత్వం ఇచ్చిన డేటాను జగన్ చదివి వినిపించారు.

ఎమ్మెల్సీల సంఖ్య పెంచుకునేందుకు, పోలవరం ముంపు మండలాల విలీనం కోసం, విద్యుత్ పంపకాల కోసం చట్టాన్ని సవరించినప్పుడు ప్రత్యేక హోదా కోసం అదే పని ఎందుకు చేయడం లేదని జగన్ నిలదీశారు. వందల కోట్లు పెట్టి ప్రైవేట్ విమానాల్లో, రాజధాని శంకుస్థాపనకు రూ. 400 కోట్లు, సీఎం ఇల్లు, కార్యాలయాల మరమ్మత్తుకు రూ. 200 కోట్లు ఖర్చు పెట్టారని, దీన్ని చూసిన తర్వాత ఎవరైనా రాష్ట్రానికి సాయం చేసేందుకు ముందుకు వస్తారా అని ప్రశ్నించారు జగన్. మూడేళ్లలో పోలవరం కడుతామంటూనే తాత్కాలిక ప్రాజెక్ట్‌గా పట్టిసీమకు 1600 కోట్లు ఖర్చు పెట్టడాన్ని ఏమనుకోవాలని ప్రశ్నించారు.

Click on image to read:

roja-in-assembly

cbn

vishnu-devineni-uma

buma-nagireddy

dulipalla

chevireddy

jagan-kodela

balakrishna1

mla-anitha

First Published:  9 March 2016 8:17 AM IST
Next Story