భూమనను ఇరికించేందుకు రంగం సిద్ధం
తుని ఘటన వెనుక వైసీపీ హస్తముందని ఆరోపిస్తూ వస్తున్న ఏపీ ప్రభుత్వం దాన్ని నిజం చేసే దిశగా అడుగులు వేస్తోంది. తుని ఘటనకు ముందు కాపు నేత ముద్రగడను వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కలిసినట్టు సీఐడీ గుర్తించిందని మీడియా చానళ్లలో వార్తలొస్తున్నాయి. ఈ ఘటనలో విచారించేందుకు భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ సిద్ధమవుతోందట. తుని ఘటనపై నివేదికను సీఐడీ చంద్రబాబుకు అందజేసిందని చెబుతున్నారు. తుని దాడిలో భీమవరం, అమలాపురం, నర్సాపురం, […]
తుని ఘటన వెనుక వైసీపీ హస్తముందని ఆరోపిస్తూ వస్తున్న ఏపీ ప్రభుత్వం దాన్ని నిజం చేసే దిశగా అడుగులు వేస్తోంది. తుని ఘటనకు ముందు కాపు నేత ముద్రగడను వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కలిసినట్టు సీఐడీ గుర్తించిందని మీడియా చానళ్లలో వార్తలొస్తున్నాయి. ఈ ఘటనలో విచారించేందుకు భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ సిద్ధమవుతోందట. తుని ఘటనపై నివేదికను సీఐడీ చంద్రబాబుకు అందజేసిందని చెబుతున్నారు. తుని దాడిలో భీమవరం, అమలాపురం, నర్సాపురం, విజయనగరం, గుంటూరు, కడప, తిరుపతికి చెందిన వారు పాల్గొన్నట్టుగా సీఐడీ గుర్తించిందని చెబుతున్నారు. ఘటన సమయంలో తీసిన విజువల్స్ ఆధారంగా నిందితులను గుర్తుపట్టినట్టు తెలుస్తోంది.
అయితే భూమన హస్తం నిజంగా ఉందా లేక రాజధాని భూకుంభకోణం నేపథ్యంలో అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందా అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు కూడా రాయలసీమ వాళ్లు వచ్చి ట్రైన్ తగలపెట్టారని ఆరోపించారు. వైసీపీ నేతల హస్తముందని ఆరోపించారు. అయితే నిజంగా వైసీపీ నేతల హస్తముంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదని విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఇప్పుడు వాటిని నిజం చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా ఉంది. ఒక వేళ ముద్రగడను భూమన కరుణాకర్ రెడ్డి కలిసినా తుని ఘటనకు ఆయన ఎలా కారణమవుతారన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది.
Click on image to read: