హే… ఉండూ…! అసెంబ్లీలో బాలయ్య అసహనం
అమ్మాయిలకు ముదైనా పెట్టాలి , లేదంటే కడుపైనా చేయాలంటూ ఒక ఆడియో ఫంక్షన్‌లో చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుని ఉంటే క్షమించాలని కోరారు. తన ప్రవర్తన గురించి అందరికీ తెలుసన్నారు. ఎవరి సినిమాల్లో లేని విధంగా తన సినిమాల్లో మహిళా పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. తన సినిమాల్లో నటించిన వారిని అడిగితే ఆ విషయం చెబుతారన్నారు. తన పాత్ర గురించి అభిమానులు ఏం కోరుకుంటున్నారన్నది మాత్రమే […]
అమ్మాయిలకు ముదైనా పెట్టాలి , లేదంటే కడుపైనా చేయాలంటూ ఒక ఆడియో ఫంక్షన్‌లో చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుని ఉంటే క్షమించాలని కోరారు. తన ప్రవర్తన గురించి అందరికీ తెలుసన్నారు. ఎవరి సినిమాల్లో లేని విధంగా తన సినిమాల్లో మహిళా పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. తన సినిమాల్లో నటించిన వారిని అడిగితే ఆ విషయం చెబుతారన్నారు. తన పాత్ర గురించి అభిమానులు ఏం కోరుకుంటున్నారన్నది మాత్రమే చెప్పానన్నారు. సినిమా పాత్రకు అనుగుణంగానే మాట్లాడానన్నారు. ఈ సమయంలో విపక్ష సభ్యులు అడ్డుతగిలే ప్రయత్నం చేయగా బాలయ్య ఆగ్రహించారు. హే… ఉండూ.. అంటూ గర్జించారు.
తాను ఆడియో ఫంక్షన్‌లో చేసిన వ్యాఖ్యలను అప్పుడు అక్కడున్న వారంతా ఎంజాయ్ చేశారన్నారు. అప్పుడు ఎవరూ తప్పుపట్టలేదన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలను ప్రెస్‌మీట్‌లో రోజా తప్పుపట్టాడాన్ని పరోక్షంగా బాలయ్య ప్రస్తావించారు. సభలో ఉన్న వందమందిని కాకుండా బయటకు వెళ్లి ఆడిగితే… తన వ్యాఖ్యలను వారు ఎలా తీసుకున్నారో తెలుస్తుందన్నారు. ప్రజాప్రతినిధిగా ఎలా వ్యవహరించాలన్నది తనకు తెలుసన్నారు.
Click on image to read: