రోజాపై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు
వైసీపీ ఎమ్మెల్యే రోజా అంటే చాలు టీడీపీ నేతలు ఒంటికాలిపై లేస్తున్నారు. మహిళల విషయంలో తప్పుగా ప్రవర్తించిన టీడీపీ ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన రోజాపై టీడీపీ నేతలు సోమిరెడ్డి, బోండా ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయంటూనే సోమిరెడ్డి తిరిగి ఆ తరహా కామెంట్స్ చేశారు. రోజా ప్రవర్తన చూసి మహిళలు సిగ్గుపడుతున్నారని సోమిరెడ్డి అన్నారు. లోకేష్ విదేశాల్లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను రోజా ప్రెస్ మీట్‌లో […]

వైసీపీ ఎమ్మెల్యే రోజా అంటే చాలు టీడీపీ నేతలు ఒంటికాలిపై లేస్తున్నారు. మహిళల విషయంలో తప్పుగా ప్రవర్తించిన టీడీపీ ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన రోజాపై టీడీపీ నేతలు సోమిరెడ్డి, బోండా ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయంటూనే సోమిరెడ్డి తిరిగి ఆ తరహా కామెంట్స్ చేశారు.
రోజా ప్రవర్తన చూసి మహిళలు సిగ్గుపడుతున్నారని సోమిరెడ్డి అన్నారు. లోకేష్ విదేశాల్లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను రోజా ప్రెస్ మీట్‌లో ప్రదర్శించడంపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. టీడీపీ తలుచుకుంటే రోజాకు సంబంధించిన చాలా వీడియోలను బయటపెడుతుందని అనుచిత వ్యాఖ్య చేశారు. రోజాపై రౌడీ షీటు తెరవాలని డిమాండ్ చేశారు. రోజాను ఏడాది కాకుండా ఐదేళ్ల పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమ కూడా రోజా ఒక బూతుల రాణిలా మారిందని విమర్శించారు. రోజాకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
Click on image to read: