Telugu Global
NEWS

బాలయ్యను లోకల్‌లో టార్గెట్ చేసిన సాక్షి

‘’అమ్మాయిల వెంటపడే పాత్రలు చేస్తే ఫ్యాన్స్  ఒప్పుకుంటారా?.. ముద్దయినా పెట్టాలి లేదా కడుపైనా చేసేయాలి. అంతే కమిట్ అయిపోవాలి. నేను   మావాడు రోహిత్‌కు మా పోలికలు కొద్దిగా అయినా రావాలి. గిల్లడాలు, పొడవడాలు. ఎక్కని ఎత్తులు లేవు. చూడని లోతులు లేవు’’.  అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారమే లేపాయి.  అయితే బాలకృష్ణ చేసిన ఈ దారుణమైన వ్యాఖ్యలను చాలా మీడియా సంస్థలు ప్రసారం చేయలేదు. మీడియా సంస్థలు ఆ పనిని అభిమానంతో చేశాయో లేక మరెందుకు చేశాయోగాని […]

బాలయ్యను లోకల్‌లో టార్గెట్ చేసిన సాక్షి
X

‘’అమ్మాయిల వెంటపడే పాత్రలు చేస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?.. ముద్దయినా పెట్టాలి లేదా కడుపైనా చేసేయాలి. అంతే కమిట్ అయిపోవాలి. నేను మావాడు రోహిత్‌కు మా పోలికలు కొద్దిగా అయినా రావాలి. గిల్లడాలు, పొడవడాలు. ఎక్కని ఎత్తులు లేవు. చూడని లోతులు లేవు’’. అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారమే లేపాయి. అయితే బాలకృష్ణ చేసిన ఈ దారుణమైన వ్యాఖ్యలను చాలా మీడియా సంస్థలు ప్రసారం చేయలేదు. మీడియా సంస్థలు ఆ పనిని అభిమానంతో చేశాయో లేక మరెందుకు చేశాయోగాని బాలయ్య వ్యాఖ్యలను వీలైనంత వరకు జనానికి తెలియకుండా ఉండేందుకు ప్రయత్నించాయి. కానీ సోషల్ మీడియా దెబ్బకు ఆ ఎత్తులేమీ ఫలించలేదు. సాక్షి పత్రిక, టీవీ మాత్రం బాలయ్య వ్యాఖ్యలను ప్రసారం చేశాయి. అయితే సాక్షి పత్రిక మెయిన్ ఎడిషన్లో మరీ పెద్దగా కాకుండా ఓ మోస్తరుగా రాసి వదిలిపెట్టింది. కానీ…

లేటుగా అయినా లేటెస్ట్‌గా అన్నట్టు బాలకృష్ణ బాగోతాన్ని సాక్షి పత్రిక అనంతపురం జిల్లా ఎడిషన్‌లో బ్యానర్ ఐటమ్‌గా ప్రచురించింది.”బరి తెగించిన బంగారు బుల్లోడు” అంటూ తాటికాయంత అక్షరాలతో కథనాన్ని రాసేసింది. చూడండి మన ఎమ్మెల్యే గారి అసలు రూపం అన్నట్టుగా కథనం ప్రచురించింది. బాలకృష్ణ అనంతపురం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండడంతో సాక్షి ఇలా అనంత ఎడిషన్లో బాలయ్యపై ఫోకస్ పెట్టినట్టి అనిపిస్తోంది. బాలయ్య వ్యాఖ్యలపై హిందూపురంలో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించింది. ఎమ్మెల్యేలా కాకుండా ఒక జులాయిలా బాలయ్య ప్రవర్తించారని మహిళలు తిట్టిపోస్తున్నారట.

లేపాక్షి ఉత్సవాల్లో సంస్కృతి, సంప్రదాయం అంటూ గొప్పగొప్ప మాటలు చెప్పిన బాలయ్య … తనలోని అసలు స్వరూపాన్ని ఆడియో ఫంక్షన్‌లో బయటపెట్టుకున్నారని మహిళలు రగిలిపోతున్నారని సాక్షి కథనం. ఎన్టీఆర్ కుటుంబం పరువును బాలయ్య తీసేశారని మహిళా సంఘాల నేతలు ఆగ్రహం చేశారని వారి పేర్లను కూడా ప్రచురించింది. మొత్తం మీద సాక్షి కథనం చూస్తుంటే హిందూపురం ప్రజలకు బాలయ్య అసలు రూపం ఇదీ అని తెలియజేసేందుకు భారీ కథనం రాసిందన్న భావన కలుగుతోంది.

Click on image to read:

adinarayana-reddy

bali

jagan

sharapova1

balakrishna

roja1

balakrishna-band-baza

roja

chandrababu-naidu

anam-son

adi-narayana-rama-subha-red

ravela

cbn-amitab-singapoor

amith-shah

chandrababu1

jagan-tdp-ravela

ravela-susheel

balakrishna-ravela

ravela1

chandrababu-naidu

ESL-Narasimhan1

First Published:  7 March 2016 6:46 AM IST
Next Story