జగన్ బురఖాలో వచ్చారా?. ఈ రెండు కుక్కలు ఎక్కడివి?
మహిళల పట్ల టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్న తీరుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా స్పందించారు. ఏపీలో కీచకుల పాలన నడుస్తోందని ఆమె మండిపడ్డారు. కీచకులందరికీ చంద్రబాబు నాయకుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లోకేష్, బాలకృష్ణ లాంటి వాళ్లను చూసి పార్టీ శ్రేణులు కూడా రెచ్చిపోతున్నాయి. అమ్మాయిలకు ముద్దు అయినా పెట్టాలి, కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణ వ్యాఖ్యలు దారుణమన్నారు. వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ విదేశాల్లో అమ్మాయిలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను […]
మహిళల పట్ల టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్న తీరుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా స్పందించారు. ఏపీలో కీచకుల పాలన నడుస్తోందని ఆమె మండిపడ్డారు. కీచకులందరికీ చంద్రబాబు నాయకుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లోకేష్, బాలకృష్ణ లాంటి వాళ్లను చూసి పార్టీ శ్రేణులు కూడా రెచ్చిపోతున్నాయి. అమ్మాయిలకు ముద్దు అయినా పెట్టాలి, కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణ వ్యాఖ్యలు దారుణమన్నారు. వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ విదేశాల్లో అమ్మాయిలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను రోజా ప్రెస్ మీట్‌లో ప్రదర్శించారు.
చిత్తకార్తె కుక్కలా మంత్రి రావెల కొడుకు ఒక ముస్లిం వివాహితపై అఘాయిత్వం చేయబోతే దాన్ని కూడా జగన్‌కు అంటగడుతారా అని ప్రశ్నించారు. రావెల కొడుకు చేసిన నీచానికి జగన్ ఎలా బాధ్యులవుతారని ప్రశ్నించారు. జగన్ ఏమైనా బురఖా వేసుకుని వెళ్లారా, లేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారా? అని రోజా ప్రశ్నించారు. విదేశాల్లో లోకేష్ మందు కొట్టి అమ్మాయిలతో చిందులు వేయడం వెనుక కూడా జగన్ హస్తముందా అని ప్రశ్నించారు. రావెల కిషోర్ బాబు తనయుడు ఒకవేళ ఏపీలో నేరం చేసి ఉంటే ఈపాటికి కుక్కపిల్ల మీదనే నిర్భయ కేసు పెట్టేవారని రోజా ఎద్దేవా చేశారు. రావెల కిషోర్ బాబు సాక్షి మీడియాపై చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. అసలు రావెల సుశీల్ చేసిన ఘనకార్యాన్ని తొలుత ప్రసారం చేసింది టీవీ9, ఎన్‌టీవీ అన్న విషయం రావెలకు తెలియదా అని ప్రశ్నించారు.
గతంలో బొండా ఉమ కుమారుడు నడిపిన కారు రేసులో ఒక యువకుడు చనిపోయినప్పుడు కూడా ఇలాగే కుక్క కథ చెప్పారని రోజా గుర్తు చేశారు. కుక్కను తప్పించబోయే ప్రయత్నంలో ప్రమాదం జరిగిందని బొండా ఉమ కుమారుడు చెప్పి కేసు నుంచి తప్పించుకున్నారని అన్నారు. ఇప్పుడూ అదే కుక్క కథను రావెల కూడా వినిపించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ రెండు కుక్కలు ఎక్కడి నుంచి వచ్చాయని రోజా ప్రశ్నించారు. ఈ రెండు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పెరిగిన కుక్కలా! లేక చంద్రబాబు పెంపుడు కుక్కలా?… అని రోజా నిలదీశారు. మహిళా తహసీల్దార్‌ను కొట్టిన చింతమనేని, మహిళను వేధించిన కొడుకును సమర్ధిస్తున్న రావెల, మహిళలను కించపరిచేలా మాట్లాడిన బాలకృష్ణ, రిషితేశ్వరి కేసులో ప్రిన్సిపల్ బాబురావుకు అండగా నిలిచిన దూళిపాళ్ల నరేంద్ర తదితరులపై చర్యలు తీసుకునే వరకు మహిళా దినోత్సవవేడుకల్లో పాల్గొనే అర్హత చంద్రబాబుకు లేదని రోజా అన్నారు.
Click on image to read: