Telugu Global
Cinema & Entertainment

జాతీయ స్థాయికి చేరిన క్షణం

లో-బడ్జెట్ లో తెరకెక్కిన క్షణం మూవీ కాస్త అభిరుచి కలిగిన ప్రేక్షకుల్ని బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా మల్టీప్లెక్స్, ఏ, బీ సెంటర్లలో ఈ సినిమాకు ఆదరణ బాగుంది. ఈ ఉత్సాహంతో క్షణం సినిమాను జాతీయ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు క్షణం మూవీ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మాత్రమే విడుదలైంది. కన్నడలో కూడా తెలుగు వెర్షనే విడుదలైంది. బెంగళూరులో ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన ఫాక్స్ స్టుడియో ఇండియా ప్రతినిధులు… […]

జాతీయ స్థాయికి చేరిన క్షణం
X
లో-బడ్జెట్ లో తెరకెక్కిన క్షణం మూవీ కాస్త అభిరుచి కలిగిన ప్రేక్షకుల్ని బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా మల్టీప్లెక్స్, ఏ, బీ సెంటర్లలో ఈ సినిమాకు ఆదరణ బాగుంది. ఈ ఉత్సాహంతో క్షణం సినిమాను జాతీయ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు క్షణం మూవీ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మాత్రమే విడుదలైంది. కన్నడలో కూడా తెలుగు వెర్షనే విడుదలైంది. బెంగళూరులో ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన ఫాక్స్ స్టుడియో ఇండియా ప్రతినిధులు… సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు. మూవీ తెలుగులోనే ఉన్నప్పటికీ… సబ్ టైటిల్స్ పెట్టి ఎ, బి సెంటర్లలో క్షణం సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో విడుదల చేసి, రెస్పాన్స్ బట్టి మిగతా రాష్ట్రాలకు రిలీజ్ ను విస్తరిస్తారు. అడవి శేషు కథ అందించిన ఈ సినిమాకు రవికాంత్ దర్శకుడు. ఆదాశర్మ, అనసూయ హీరోయిన్లుగా నటించారు.
First Published:  7 March 2016 6:43 AM IST
Next Story