చిక్కుల్లో బాలయ్య… యాక్షన్ కు మొదలైన రియాక్షన్
‘’అమ్మాయిల వెంటపడే పాత్రలు చేస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?.. అమ్మాయిలకు ముద్దయినా పెట్టాలి లేదా కడుపైనా చేసేయాలి. అంతే కమిట్ అయిపోవాలి. నేను మావాడు రోహిత్‌కు మా పోలికలు కొద్దిగా అయినా రావాలి. గిల్లడాలు, పొడవడాలు…. నేను ఎక్కని ఎత్తులు లేవు. చూడని లోతులు లేవు’’. అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారమే లేపాయి. అమ్మాయిపై లైంగిక దాడులను ప్రేరేపించేలా బాలకృష్ణ వ్యాఖ్యలున్నాయంటూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ లో న్యాయవాదులు తమ […]
‘’అమ్మాయిల వెంటపడే పాత్రలు చేస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?.. అమ్మాయిలకు ముద్దయినా పెట్టాలి లేదా కడుపైనా చేసేయాలి. అంతే కమిట్ అయిపోవాలి. నేను మావాడు రోహిత్‌కు మా పోలికలు కొద్దిగా అయినా రావాలి. గిల్లడాలు, పొడవడాలు…. నేను ఎక్కని ఎత్తులు లేవు. చూడని లోతులు లేవు’’. అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారమే లేపాయి. అమ్మాయిపై లైంగిక దాడులను ప్రేరేపించేలా బాలకృష్ణ వ్యాఖ్యలున్నాయంటూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ లో న్యాయవాదులు తమ ఫిర్యాదు నమోదు చేశారు. వెంటనే బాలకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేయాలని న్యాయవాదులు కోరారు. మహిళలపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు క్షమార్హం కాదని లాయర్లు అంటున్నారు.
ఇప్పటికే కొందరు బాలయ్య చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. బాలయ్య చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నారు. చట్టం అందరికీ సమానమే అన్న విధంగా పనిచేస్తే మాత్రం బాలకృష్ణకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు.
Click on image to read: