రాయలసీమ ఆలయాలను చంద్రబాబు కొల్లగొడుతున్నారా?
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ వనరులను చంద్రబాబు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. అలా కొల్లగొట్టిన సొమ్మును తీసుకెళ్లి అమరావతిలో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి జనం కరువుతో అల్లాడుతుంటే పట్టించుకోకుండా లక్షల కోట్ల విలువైన ఎర్రచందనం, ఖనిజసంపదను తరలించుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకంలో వస్తున్న వందల కోట్ల రూపాయలను కూడా చంద్రబాబు వదిలిపెట్టడం లేదని విమర్శించారు. సీమ […]
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ వనరులను చంద్రబాబు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. అలా కొల్లగొట్టిన సొమ్మును తీసుకెళ్లి అమరావతిలో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి జనం కరువుతో అల్లాడుతుంటే పట్టించుకోకుండా లక్షల కోట్ల విలువైన ఎర్రచందనం, ఖనిజసంపదను తరలించుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకంలో వస్తున్న వందల కోట్ల రూపాయలను కూడా చంద్రబాబు వదిలిపెట్టడం లేదని విమర్శించారు. సీమ ఆలయాల ఆదాయాన్ని తీసుకెళ్లి అమరావతిలో ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. సీమ నుంచి వస్తున్న ఆదాయంపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రలో కడుతున్న రాజధాని కోసం ఫారెస్ట్ ల్యాండ్ డీనోటిఫై పైనా బైరెడ్డి తీవ్రంగా స్పందించారు. గుంటూరు జిల్లాలో రాజధాని కోసం ఫారెస్ట్ ల్యాండ్ తీసుకుంటే అందుకు బదులుగా కడప జిల్లాలోని భూములను అటవీ శాఖకు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. కోస్తా రాజధానికి కడప జిల్లా రైతులు తమ భూములను త్యాగం చేయాలా అని ప్రశ్నించారు. కోస్తాంధ్రలో కలసి ఉంటే రాయలసీమ అభివృద్ధి చెందే అవకాశమే లేదని… ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు, మేధావు లు పోరాటానికి సిద్ధం కావాలని బైరెడ్డి పిలుపునిచ్చారు.
Click on image to read: