కొడుకు కేసులోకి జగన్‌ను లాగిన రావెల
హైదరాబాద్‌లో మహిళ చేయి లాగి నిర్భయ కేసులో బుక్ అయిన తన కుమారుడిని మంత్రి రావెల కిషోర్ బాబు వెనుకేసుకొచ్చారు. తన కుమారుడు అమాయకుడని వాదించారు. ఈ అంశంపై ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రావెల కిషోర్ బాబు… దీని వెనుక కూడా జగన్ హస్తముందని ఆరోపించాడు. మందకృష్ణ మాదిగపైనా రావెల ఆరోపణలు చేశారు. జగన్ తనను రాజకీయంగా ఎదుర్కోలేక అమాయకుడైన తన కుమారుడు రావెల సుశీల్‌ను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇంత కన్నా నీచరాజకీయం ఒకటి […]
హైదరాబాద్‌లో మహిళ చేయి లాగి నిర్భయ కేసులో బుక్ అయిన తన కుమారుడిని మంత్రి రావెల కిషోర్ బాబు వెనుకేసుకొచ్చారు. తన కుమారుడు అమాయకుడని వాదించారు. ఈ అంశంపై ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రావెల కిషోర్ బాబు… దీని వెనుక కూడా జగన్ హస్తముందని ఆరోపించాడు. మందకృష్ణ మాదిగపైనా రావెల ఆరోపణలు చేశారు.
జగన్ తనను రాజకీయంగా ఎదుర్కోలేక అమాయకుడైన తన కుమారుడు రావెల సుశీల్‌ను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇంత కన్నా నీచరాజకీయం ఒకటి ఉండదన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు జగనే తన కుమారుడిపై కేసు పెట్టించారని ఆరోపించారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో ఉన్నది తన కుమారుడి కారు కాదని చెప్పారు. ఎక్కడో కారు ఫుటేజ్ తీసుకొచ్చి జగన్ అందరినీ తప్పుదారి పట్టిస్తున్నారని రావెల విమర్శించారు. మీడియా ద్వారా అబద్దాలు ప్రచారం చేయించినా కోర్టుల్లో అసలు నిజాలు బయటకొస్తాయన్నారు. పరోక్షంగా తెలంగాణ పోలీసులను లోబరుచుకున్నారన్న అర్థమొచ్చేలా రావెల మాట్లాడారు.
అమాయకుడైన తన కుమారుడిపై జరుగుతున్న కుట్రలు చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. జగన్‌కు దమ్ముంటే తనను నేరుగా ఎదుర్కోవాలన్నారు రావెల. అయితే రావెల కారు ఫుటేజ్‌ను మంత్రి చెప్పినట్టు జగన్ మీడియా ఒక్కటే కాదు టీడీపీ అనుకూల మీడియా సంస్థలతో పాటు తటస్థ మీడియా చానళ్లు కూడా ప్రసారం చేశాయి. పోలీసులు కూడా అది నిజమైన ఫుటేజే అని నిర్ధారించారు. మంత్రి రావెల మాత్రం తన కుమారుడు అమాయకుడని చెబుతున్నారు. అయితే ఈ కేసులో మీడియా ప్రతినిధులు మరిన్ని ప్రశ్నలు అడుగుతుండగానే రావెల వెంటనే అక్కడిని నుంచి వెళ్లిపోయారు.
ఎస్సీ వర్గీకరణకు పోరాడుతున్న మంద కృష్ణ మాదిగపైనా రావెల ఆరోపణలు చేశారు. ఆంధ్రాలో దళితుల కోసం పోరాటం చేసేందుకు మందకృష్ణ ఎవరని ప్రశ్నించారు. మందకృష్ణ వెనుక కూడా జగన్ హస్తముందని ఆరోపించారు.
Click on image to read: