ఆణిముత్యం, అగ్నిపరీక్ష అంటారా!… మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయాలి
రాజధాని భూకుంభకోణంపై పత్రికల్లో వచ్చిన కథనాలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. బట్టకాల్చి ముఖం మీద వేసినట్టు తప్పుడు కథనాలు రాసి తప్పులేదని నిరూపించుకోమంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని భూముల అక్రమాలపై విచారణ కమిటీ వేస్తారా అని ప్రశ్నించిన విలేకరిపై బాబు రుసరుసలాడారు. ‘’నీవు ఏదో రాసి అణిముత్యం అని నిరూపించుకో… అగ్నిపరీక్ష జరిపించుకో అంటే చేయించుకోవాలా?. నీ దగ్గర ఆధారాలుంటే చూపించు. వాళ్ల మీద రాసిన నిన్ను ప్రాసిక్యూట్ చేయాలి. అప్పుడు మీకు భయం […]
రాజధాని భూకుంభకోణంపై పత్రికల్లో వచ్చిన కథనాలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. బట్టకాల్చి ముఖం మీద వేసినట్టు తప్పుడు కథనాలు రాసి తప్పులేదని నిరూపించుకోమంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని భూముల అక్రమాలపై విచారణ కమిటీ వేస్తారా అని ప్రశ్నించిన విలేకరిపై బాబు రుసరుసలాడారు. ‘’నీవు ఏదో రాసి అణిముత్యం అని నిరూపించుకో… అగ్నిపరీక్ష జరిపించుకో అంటే చేయించుకోవాలా?. నీ దగ్గర ఆధారాలుంటే చూపించు. వాళ్ల మీద రాసిన నిన్ను ప్రాసిక్యూట్ చేయాలి. అప్పుడు మీకు భయం ఉంటుంది. ఎక్కడున్నాయి ఉల్లంఘనలు?. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తారా?. ఏదో రాయడం, నిరూపించుకో అనడం అలవాటుగా మారింది. ఇష్టానుసారం రాస్తారా? ఇంకేం పనిలేదనుకున్నారా?’’ అని బాబు మండిపడ్డారు.
వేమూరి రవికుమార్ 500 ఎకరాలు కొనుగోలు చేయడంపైనా చంద్రబాబు స్పందించారు. ఈయన రాజధాని ప్రకటన రాకముందే 500 ఎకరాలు కొన్న మాట నిజమేనని అయితే ఆ భూముల కొనుగోలుతో తమకెలాంటి సంబంధం లేదన్నారు.
రాజధానిలో ఎక్కడా అక్రమాలు జరగలేదన్నారు. తానుంటున్న లింగమనేని నివాసం అక్రమం కాదని చెప్పారు. అది ప్రభుత్వం ఆస్తి అన్నారు. ల్యాండ్ పూలింగ్‌లో ఆ భూమి ఉందన్నారు. లింగమనేని ఎస్టేట్ భూముల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. ఎస్టేట్ భూములను పూలింగ్‌లో ఇచ్చేందుకు లింగమనేని ముందుకొస్తే తానే తీసుకోలేదని చెప్పారు. ఉన్న భూమే సరిపోతుందని చెప్పానన్నారు. అసలు గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య బెదిరిస్తే భూములిస్తారా అని ఎదురు ప్రశ్నించారు. అక్కడి వారు భయపెడితే భయపడే పరిస్థితిలో ఉన్నారా అని ప్రశ్నించారు.
Click on image to read: