టీడీపీలో చిచ్చుపెట్టిన సాక్షి
రాజధాని దురాక్రమణపై సాక్షి ప్రచురించిన కథనాలు టీడీపీలో ప్రకంపనలు సృష్టించాయి. ప్రెస్‌మీట్ అంటే చాలా మెరుపువేగంతో ముందుకొచ్చే టీడీపీ నేతలు ఈ విషయంలో మాత్రం మైకులకు దూరంగా బతుకుతున్నారు. ప్రెస్‌మీట్ నిర్వహించాలని పార్టీ కార్యాలయం నుంచి సమాచారం వచ్చినా ఏదో సాకులు చెప్పి తప్పించుకుంటున్నారట టీడీపీ నేతలు. ఇందుకు ముఖ్యంగా రెండు కారణాలు చెబుతున్నారు. ఒకటి ఇంతకాలం సాధు జీవిలా కథనాలు రాసుకుంటూ వచ్చిన సాక్షి పత్రిక ఒక్కసారి జూలు విధించే సరికి టీడీపీ నేతలు ఆలోచనలో […]
రాజధాని దురాక్రమణపై సాక్షి ప్రచురించిన కథనాలు టీడీపీలో ప్రకంపనలు సృష్టించాయి. ప్రెస్‌మీట్ అంటే చాలా మెరుపువేగంతో ముందుకొచ్చే టీడీపీ నేతలు ఈ విషయంలో మాత్రం మైకులకు దూరంగా బతుకుతున్నారు. ప్రెస్‌మీట్ నిర్వహించాలని పార్టీ కార్యాలయం నుంచి సమాచారం వచ్చినా ఏదో సాకులు చెప్పి తప్పించుకుంటున్నారట టీడీపీ నేతలు. ఇందుకు ముఖ్యంగా రెండు కారణాలు చెబుతున్నారు.
ఒకటి ఇంతకాలం సాధు జీవిలా కథనాలు రాసుకుంటూ వచ్చిన సాక్షి పత్రిక ఒక్కసారి జూలు విధించే సరికి టీడీపీ నేతలు ఆలోచనలో పడ్డారని చెబుతున్నారు. సాక్షిని, జగన్‌ను ఇంతకుముందు లాగా తిడితే తమనూ ఎక్కడ టార్గెట్ చేస్తారోనని భయపడుతున్నారట. ప్రెస్‌మీట్ పెట్టి తిట్టడం ఎందుకు… మరుసటి రోజు సాక్షిలో తమ గురించి ఏమొస్తుందోనని టెన్షన్ పడడం ఎందుకని కొందరు నోరున్న నేతలు కూడా ఒక నిర్ధారణకు వచ్చారట. అందుకే రాజధాని భూములపై ప్రెస్ మీట్ అంటే దానిపై తమకు పూర్తిగా అవగాహన లేదని మరొకరితో మాట్లాడిస్తే బాగుంటుందని చెప్పి తప్పుకుంటున్నారట.
మరికొందరు సబ్జెక్ట్ పై అవగాహన ఉండి కూడా మీడియాతో మాట్లాడేందుకు ముందుకు రావడం లేదని చెబుతున్నారు. వారిది కడుపు మంట అని అంటున్నారు. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకుని రహస్యంగా భూములు కొనడంపై వారు ఆగ్రహంగా ఉన్నారట. దొంగచాటుగా భూములు కొన్న వారి కోసం తామెందుకు గొంతు చించుకోవాలని కొందరు టీడీపీ నేతలు నిలదీస్తున్నారట. ఎవరిది వారే కడుక్కుంటే బాగుంటుందని సలహా ఇస్తున్నారట. ఒక నేత ఆక్రోశం పట్టలేక రాజధాని ఎక్కడ వస్తుందన్నది ఒక సామాజికవర్గం నేతలకే ఎలా తెలిసిందని ప్రశ్నించారట.
తాము కూడా దశాబ్దాలుగా పార్టీలో ఉన్నామని గుర్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన నోరున్న నేత, వరదలా మాట్లాడగలిగే రాజధాని జిల్లాలకు చెందిన ఒక నాయకుడు మీడియాతో మాట్లాడేందుకు ససేమిరా అంటున్నారట. వాళ్లు భూములు కొంటే వారి తరపున మేమెందుకు వకాల్తా పుచ్చుకోవాలని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు నేతలు సాక్షి కథనాలను లోలోన అభినందిస్తున్నారట. భూములు కొనడం తప్పులేదుగానీ మరీ ఇంతగా వేల ఎకరాలు, వందల ఎకరాలు కొనడాన్ని ఏమనాలని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాలు వెలుగులోకి రావడం మంచిదే అయిందని అభిప్రాయపడుతున్నారట.
Click on image to read: