Telugu Global
Cinema & Entertainment

రామ్‌గోపాల్ వ‌ర్మ నాయిక‌కు పెళ్ల‌య్యింది!

రామ్‌గోపాల్ వ‌ర్మ హీరోయిన్, రంగీలా నాయిక ఊర్మిలా మంటోద్క‌ర్ పెళ్లి చేసుకుంది. త‌న ఇంట్లోనే నిరాడంబ‌రంగా నిన్న‌నే ఈ వివాహం జ‌రిగింది. కాశ్మీర్‌కి చెందిన వ్యాపార‌వేత్త మొహ్‌సిన్‌ అక్త‌ర్ మిర్ వ‌రుడు.  అతనికి సొంత వ్యాపారాలు ఉన్నా సినిమాల మీద మోజుతో ముంబయి వ‌చ్చేశాడు. కొన్ని సినిమాల్లో న‌టించాడు. 2007 మిస్ట‌ర్ ఇండియా మోడ‌ల్ హంట్‌లో సెకండ్ ర‌న్న‌ర‌ప్ కూడా.  బాలివుడ్ సెల‌బ్రిటీ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల ప్ర‌క‌ట‌న‌ల్లో మొహ్‌సిన్ క‌నిపించాడు, అలాగే […]

రామ్‌గోపాల్ వ‌ర్మ నాయిక‌కు పెళ్ల‌య్యింది!
X

రామ్‌గోపాల్ వ‌ర్మ హీరోయిన్, రంగీలా నాయిక ఊర్మిలా మంటోద్క‌ర్ పెళ్లి చేసుకుంది. త‌న ఇంట్లోనే నిరాడంబ‌రంగా నిన్న‌నే ఈ వివాహం జ‌రిగింది. కాశ్మీర్‌కి చెందిన వ్యాపార‌వేత్త మొహ్‌సిన్‌ అక్త‌ర్ మిర్ వ‌రుడు. అతనికి సొంత వ్యాపారాలు ఉన్నా సినిమాల మీద మోజుతో ముంబయి వ‌చ్చేశాడు. కొన్ని సినిమాల్లో న‌టించాడు. 2007 మిస్ట‌ర్ ఇండియా మోడ‌ల్ హంట్‌లో సెకండ్ ర‌న్న‌ర‌ప్ కూడా. బాలివుడ్ సెల‌బ్రిటీ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల ప్ర‌క‌ట‌న‌ల్లో మొహ్‌సిన్ క‌నిపించాడు, అలాగే మ‌నీష్‌కి ఊర్మిళ స‌న్నిహితురాలు. అలా మ‌నీష్ మ‌ల్హోత్రా ద్వారా ఆ ఇద్ద‌రు క‌లుసుకున్నారు.

ఊర్మిళ అపార్ట్‌మెంట్ టెర్ర‌స్ మీద హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగిన వివాహ వేడుక‌లో అతి కొద్దిమంది స‌న్నిహితులు మాత్ర‌మే పాల్గొన్నారు. మొహ్‌సిన్‌ ఊర్మిళ కంటే వ‌య‌సులో ప‌దేళ్లు చిన్న‌వాడు. ఊర్మిళ వ‌య‌సు 42. ప్ర‌స్తుతం అత‌ను ఊర్మిళ‌తోపాటు క‌లిసి బ‌త‌క‌డానికి ముంబ‌యి వ‌చ్చేశాడు. ఊర్మిళ‌ను చూసిన తొలిచూపులోనే మొహ్‌సిన్ ఆమెను ప్రేమించాడు. వెంట‌బ‌డి మ‌‌రీ ఒప్పించాడు.

First Published:  4 March 2016 11:29 AM IST
Next Story