టీటీడీపీ ప్రాణం నిలుపుతున్న ఓటుకు నోటు
తెలంగాణలో టీడీపీ కథ క్లైమాక్స్‌కు వచ్చినట్టుగా ఉంది. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా పెట్టె సర్దేస్తున్నారు. తాజాగా జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే గోపినాథ్‌తో పాటు మరో ఎమ్మెల్యే పార్టీ వీడేందుకు సిద్ధపడ్డారని సమాచారం. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇక టీడీపీతో లాభం లేదన్న నిర్దారణకు వచ్చారని చెబుతున్నారు. పైగా గ్రేటర్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ టీఆర్ఎస్ కార్పొరేటర్లే విజయం సాధించారు. దీంతో గ్రేటర్ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి మరింత అధికమైంది. ఈ ఇద్దరు […]
తెలంగాణలో టీడీపీ కథ క్లైమాక్స్‌కు వచ్చినట్టుగా ఉంది. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా పెట్టె సర్దేస్తున్నారు. తాజాగా జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే గోపినాథ్‌తో పాటు మరో ఎమ్మెల్యే పార్టీ వీడేందుకు సిద్ధపడ్డారని సమాచారం. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇక టీడీపీతో లాభం లేదన్న నిర్దారణకు వచ్చారని చెబుతున్నారు. పైగా గ్రేటర్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ టీఆర్ఎస్ కార్పొరేటర్లే విజయం సాధించారు. దీంతో గ్రేటర్ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి మరింత అధికమైంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం టీఆర్ఎస్ నేతలనే బతిమలాడుకుని టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు చెబుతున్నారు.
వీరు ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్లిపోతే ఇక మిగిలింది రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఆర్ కృష్ణయ్య. అయితే ఆర్ కృష్ణయ్య పార్టీలో ఉన్నా లేనట్టేనని తెలుగుతమ్ముళ్లు భావిస్తున్నారు. గోపినాథ్ చేరికకు టీఆర్ఎస్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని చెబుతున్నారు. అయితే టీడీపీ పూర్తి స్థాయిలో కనుమరుగు కాకుండా ఓటుకు నోటు కేసే కాపాడిందని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఓటుకు నోటు కారణంగా రేవంత్ రెడ్డి, సండ్రను టీఆర్ఎస్ ఎట్టిపరిస్థితిలోనూ చేర్చుకోదని అంటున్నారు. కాబట్టి తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ప్రాతినిధ్యం కొనసాగుతుందని ధీమాగా చెబుతున్నారు.
Click on image to read: