Telugu Global
Cinema & Entertainment

ఊపిరి తీసుకోకుండా చెప్పేశాడు

నాగార్జున-కార్తి హీరోలుగా నటించిన ఊపిరి సినిమా మార్చి 25న విడుదలకానుంది. ఈ సినిమాను ఒకేసారి రెండు భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు చాలా టైం పడుతోంది. దీంతో యూనిట్ కు సహకరించేందుకు నాగార్జున ఓ పెద్ద సాహసమే చేశాడు. ఊపిరి సినిమా డబ్బింగ్ ను… ఏకథాటిగా పూర్తిచేశాడు. ఒక రోజంతా డబ్బింగ్ థియేటర్ లోనే గడిపిన నాగార్జున… నెక్ట్స్ డే వచ్చి మరో 2 గంటల్లో మిగతా పార్ట్ పూర్తిచేశాడట. అంతేకాదు… […]

ఊపిరి తీసుకోకుండా చెప్పేశాడు
X
నాగార్జున-కార్తి హీరోలుగా నటించిన ఊపిరి సినిమా మార్చి 25న విడుదలకానుంది. ఈ సినిమాను ఒకేసారి రెండు భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు చాలా టైం పడుతోంది. దీంతో యూనిట్ కు సహకరించేందుకు నాగార్జున ఓ పెద్ద సాహసమే చేశాడు. ఊపిరి సినిమా డబ్బింగ్ ను… ఏకథాటిగా పూర్తిచేశాడు. ఒక రోజంతా డబ్బింగ్ థియేటర్ లోనే గడిపిన నాగార్జున… నెక్ట్స్ డే వచ్చి మరో 2 గంటల్లో మిగతా పార్ట్ పూర్తిచేశాడట. అంతేకాదు… ఆ మరుసటి రోజు ఊపిరి తమిళ వెర్షన్ కు కూడా డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. తొలిసారిగా తమిళ్ లో నాగార్జున డబ్బింగ్ చెప్పుకుంటున్న సినిమా ఇదే కావడం విశేషం. అందుకే తమిళ డబ్బింగ్ కు మాత్రం కాస్త టైమ్ తీసుకుంటున్నాడు. తమన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో గాబ్రియాలా ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. వంశీ పైడిపల్లి దర్శకుడు.
First Published:  4 March 2016 5:18 AM IST
Next Story