Telugu Global
NEWS

ఫోన్‌ ట్యాప్‌ చేశారుగా!.. వాటితో నిరూపించండి

కాపు ఉద్యమం వెనుక జగన్‌ ఉన్నారన్న చంద్రబాబు ఆరోపణపై ముద్రగడ తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని చంద్రబాబు నిరూపించాలని సవాల్ విసిరారు. తన ఫోన్లను నిత్యం ట్యాప్ చేస్తున్నారని… తాను ఎవరెవరితో మాట్లాడుతున్నది మొత్తం చంద్రబాబు కంప్యూటర్‌లో ఉందన్నారు.  నిజంగా తాను జగన్‌కు టచ్‌లో ఉంటే ఫోన్ ట్యాపింగ్ ఆధారాలను బయటపెట్టాలని సవాల్ విసిరారు. ముద్రగడ లేఖ జగన్‌ రాసినట్టుగా ఉందని ఇటీవల చంద్రబాబు అనడంపైనా ఆయన స్పందించారు. జగన్‌తో తనకు సంబంధం ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయాలతో […]

ఫోన్‌ ట్యాప్‌ చేశారుగా!.. వాటితో నిరూపించండి
X

కాపు ఉద్యమం వెనుక జగన్‌ ఉన్నారన్న చంద్రబాబు ఆరోపణపై ముద్రగడ తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని చంద్రబాబు నిరూపించాలని సవాల్ విసిరారు. తన ఫోన్లను నిత్యం ట్యాప్ చేస్తున్నారని… తాను ఎవరెవరితో మాట్లాడుతున్నది మొత్తం చంద్రబాబు కంప్యూటర్‌లో ఉందన్నారు. నిజంగా తాను జగన్‌కు టచ్‌లో ఉంటే ఫోన్ ట్యాపింగ్ ఆధారాలను బయటపెట్టాలని సవాల్ విసిరారు.

ముద్రగడ లేఖ జగన్‌ రాసినట్టుగా ఉందని ఇటీవల చంద్రబాబు అనడంపైనా ఆయన స్పందించారు. జగన్‌తో తనకు సంబంధం ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయాలతో పాటు కాపు ఉద్యమాన్ని కూడా విరమిస్తానని చెప్పారు. జగన్‌ వయసు తన రాజకీయ అనుభవమంత ఉంటుందన్నారు. అలాంటి జగన్‌తో లేఖ రాయించుకోవాల్సిన అవసరం తనకుందా అని ప్రశ్నించారు. తనకు లేఖ రాసుకునే పరిజ్ఞానం కూడా లేదనుకుంటున్నారా? అని చంద్రబాబును ప్రశ్నించారు.

చంద్రబాబు పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడడం మానుకోవాలని సూచించారు. మొన్న దీక్ష విరమిస్తే ముద్రగడ అమ్ముడుపోయారని చంద్రబాబే ప్రచారం చేయించారని ఆరోపించారు. ఇప్పుడు తిరిగి దీక్ష చేస్తానని ప్రకటించగానే జగన్‌, ముద్రగడ ఒకటైపోయారని ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈనెల 11 నుంచి ఆమరణ దీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు.

Click on image to read:

sakshi

kcr

bhuma

ttdp

ravela-son

gade

bonda

sujana

murali-mohan

mudragada

chandrababu-suryudu

chandrababu-1

chandrababu

payyavula-keshav

narayana-pattipati

roja

Minister-MLC-Narayana

jagan1

lokesh
chandrababu

MLC-Narayana

dulipala

mininster-Narayana

First Published:  4 March 2016 5:59 AM IST
Next Story