అరుణాచలం బాటలోనే కబలి
అరుణాచలం సినిమా గుర్తుందా… ఏకంగా ఒక జీవితచక్రాన్ని ఆ సినిమాలో చూపిస్తారు. రజనీకాంత్ కుర్రాడిగా ఉండే పాత్ర నుంచి ఆయనకు వయసుమళ్లి ఓ కూతురుకు తండ్రిగా మారే పాత్ర వరకు అరుణాచలం సినిమా నడుస్తుంది. ఇప్పుడు కబాలి కూడా అదే దారిలో ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. ఆ స్టిల్స్ లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రాధికా ఆప్టేతో ప్రేమలో పడే సన్నివేశాలకు […]
BY admin4 March 2016 7:47 AM IST
X
admin Updated On: 4 March 2016 8:20 AM IST
అరుణాచలం సినిమా గుర్తుందా… ఏకంగా ఒక జీవితచక్రాన్ని ఆ సినిమాలో చూపిస్తారు. రజనీకాంత్ కుర్రాడిగా ఉండే పాత్ర నుంచి ఆయనకు వయసుమళ్లి ఓ కూతురుకు తండ్రిగా మారే పాత్ర వరకు అరుణాచలం సినిమా నడుస్తుంది. ఇప్పుడు కబాలి కూడా అదే దారిలో ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. ఆ స్టిల్స్ లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రాధికా ఆప్టేతో ప్రేమలో పడే సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు విడుదలయ్యాయి. ఈ స్టిల్స్ లో రజనీకాంత్-రాధిక మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. సేమ్ టైం…. రజనీకాంత్-రాధికలు వయసు మళ్లిన పాత్రలు పోషించిన స్టిల్స్ కూడా విడుదలయ్యాయి. ఈ ఫోటోల్ని కంపేర్ చేస్తే…. కబాలి సినిమా కూడా అరుణాచలం స్టయిల్ లోనే ఉంటుందేమో అని తళైవ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
Next Story