లోకేష్ అంటే ఎందుకంత నిర్లక్ష్యం?
ఇటీవల నారా లోకేష్ దూకుడు పెంచారు. తన ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. కానీ లోకేష్ కామెంట్స్‌కు, సవాళ్లకు అవతలి వైపు నుంచి స్పందన లేకపోవడం చర్చనీయాంశమైంది. ఆ మధ్య గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నేతలకు లోకేష్ పదేపదే సవాల్ విసిరారు. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు లోకేష్. కానీ ”తమ్ముడు లోకేష్” అంటూ కేటీఆర్ లైట్ తీసుకున్నారు. గ్రేటర్ బరిలో ఎంత దూకుడుగా విమర్శలు చేసినా టీఆర్ఎస్ నుంచి సీరియస్‌గా స్పందన రాలేదు. […]
ఇటీవల నారా లోకేష్ దూకుడు పెంచారు. తన ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. కానీ లోకేష్ కామెంట్స్‌కు, సవాళ్లకు అవతలి వైపు నుంచి స్పందన లేకపోవడం చర్చనీయాంశమైంది. ఆ మధ్య గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నేతలకు లోకేష్ పదేపదే సవాల్ విసిరారు. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు లోకేష్. కానీ ”తమ్ముడు లోకేష్” అంటూ కేటీఆర్ లైట్ తీసుకున్నారు. గ్రేటర్ బరిలో ఎంత దూకుడుగా విమర్శలు చేసినా టీఆర్ఎస్ నుంచి సీరియస్‌గా స్పందన రాలేదు. వైసీపీ నేతలు కూడా లోకేష్ విషయంలో అలాగే వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే జగన్‌కు దమ్ముంటే ప్రభుత్వాన్ని ఒకరోజులో కూల్చేయాలని లోకేష్ సవాల్ విసిరారు. కానీ లోకేష్ సవాల్‌కు స్పందించిన వారే లేరు. తాజాగా రాజధాని దురాక్రమణ అంటూ సాక్షి కథనాలు రాసిన నేపథ్యంలో జగన్‌కు లోకేష్ సవాల్ విసిరారు.
ఆస్తుల వివరాలపై చర్చించేందుకు బహిరంగ చర్చకు రావాలని జగన్‌కు సవాల్ విసిరారు చినబాబు. జగన్ బహిరంగ చర్చకు వస్తే తాను సిద్ధమని సవాల్ విసిరారు. కానీ లోకేష్ సవాల్‌ను అసలు వైసీపీ నేతలు లెక్కలోకి తీసుకున్నట్టుగా కనిపించడం లేదు. లోకేష్‌తో బహిరంగ చర్చకు జగన్ వెళ్లాలా! …అన్న ధోరణిలో లైట్ తీసుకున్నట్టుగా ఉంది. లోకేష్ ఇలా ఎన్నిసార్లు సవాల్ విసిరినా అవతలి పక్షం నుంచి స్పందన లేకపోవడం ఆసక్తికరంగానే ఉంది. లోకేష్‌కు భయపడి సవాల్ స్వీకరించడం లేదా… లేదంటే కోట్ల రూపాయల ఆస్తులను కూడా లోకేష్, చంద్రబాబులు లకల రూపాయల్లో చూపించడం వల్ల విషయం ప్రజలకే అర్ధం అయింది ఇక చర్చ ఎందుకు? అని చినబాబును లైట్ తీసుకుంటున్నారా అన్నది అంతుచిక్కడం లేదు.
Click on image to read: