ఆ "యూస్‌లెస్ ఫెలో"కు కారణం ఈ "యూస్‌లెస్ ఫెలో"నే!
చంద్రబాబుపై ఈగ వాలితే సహించేట్టుగా లేరు టీడీపీ నేతలు. చంద్రబాబును విమర్శించిన పురందేశ్వరి, సి. రామచంద్రయ్యపై వర్ల రామయ్య ఏకకాలంలో అటాక్ చేశారు. రామచంద్రయ్య చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ చిరును తెరపైకి తెచ్చారు. చంద్రబాబునాయుడు యూజ్లెస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇన్ ది స్టేట్ అని రామచంద్రయ్య విమర్శించారు. కాబట్టి ఎవరైనా ఒక ఎఫిషియంట్ ఫెలోని చూసి సీఎంగా చేయాలని సూచించారు. రామచంద్రయ్య మాటలకు వర్ల రామయ్య కూడా యూస్‌లెస్ ఫెలో డైలాగ్‌తోనే కౌంటర్ ఇచ్చారు. […]
చంద్రబాబుపై ఈగ వాలితే సహించేట్టుగా లేరు టీడీపీ నేతలు. చంద్రబాబును విమర్శించిన పురందేశ్వరి, సి. రామచంద్రయ్యపై వర్ల రామయ్య ఏకకాలంలో అటాక్ చేశారు. రామచంద్రయ్య చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ చిరును తెరపైకి తెచ్చారు.
చంద్రబాబునాయుడు యూజ్లెస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇన్ ది స్టేట్ అని రామచంద్రయ్య విమర్శించారు. కాబట్టి ఎవరైనా ఒక ఎఫిషియంట్ ఫెలోని చూసి సీఎంగా చేయాలని సూచించారు. రామచంద్రయ్య మాటలకు వర్ల రామయ్య కూడా యూస్‌లెస్ ఫెలో డైలాగ్‌తోనే కౌంటర్ ఇచ్చారు. రామచంద్రయ్య దగ్గర సలహాలు తీసుకున్న వారు యూజ్లెస్ ఫెలోగా మారిపోతారని అన్నారు.
చిరంజీవి రాష్ట్ర రాజకీయాల్లో యూజ్లెస్ ఫెలోగా మారిపోవడానికి ఈ యూస్‌లెస్ ఫెలో( సి. రామచంద్రయ్య) ఇచ్చిన సలహాలే కారణమని రామయ్య ఎద్దేవా చేశారు. రామచంద్రయ్య మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. చిరంజీవి అంటే రామచంద్రయ్యకు ఎక్కువ అభిమానం. ఎవరైనా చిరును విమర్శిస్తే రామచంద్రయ్య ప్రతిఘటిస్తుంటారు. ఈ ఉద్దేశంతోనే తమ నేత చంద్రబాబును విమర్శించిన రామచంద్రయ్యను… చిరుతో కలిపి వర్ల రామయ్య తిట్టి ఉండవచ్చు.
Click on image to read: