ఈమె వంగవీటి రత్నకుమారి
విజయవాడలో జరిగిన ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న వంగవీటి చిత్రంలో నటుల ఎంపిక విషయంలోనూ రాంగోపాల్ వర్మ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వంగవీటి పాత్రకు నటుడిని ఎంపిక చేసిన వర్మ తాజాగా వంగవీటి రంగా భార్య పాత్ర కోసం నటిని ఎంపిక చేశారు. బెంగాళి నటి నైనా గంగూలిని ఎంపిక చేశాడు. ఆమె ఫొటోలను విడుదల చేశారు. చిత్రంలో రత్నకుమారి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. “వంగవీటి రంగాగారిని చంపిన తర్వాతే, వంగవీటి రత్నకుమారిగారు వెలుగులోకి వచ్చారు…కానీ […]

విజయవాడలో జరిగిన ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న వంగవీటి చిత్రంలో నటుల ఎంపిక విషయంలోనూ రాంగోపాల్ వర్మ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వంగవీటి పాత్రకు నటుడిని ఎంపిక చేసిన వర్మ తాజాగా వంగవీటి రంగా భార్య పాత్ర కోసం నటిని ఎంపిక చేశారు. బెంగాళి నటి నైనా గంగూలిని ఎంపిక చేశాడు. ఆమె ఫొటోలను విడుదల చేశారు.
చిత్రంలో రత్నకుమారి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. “వంగవీటి రంగాగారిని చంపిన తర్వాతే, వంగవీటి రత్నకుమారిగారు వెలుగులోకి వచ్చారు…కానీ ఆ హత్య జరగక ముందు రత్నకుమారిగారి జీవితంలో ఆవిడ అనుభవించిన భావోద్వేగాలని అభినయించగలిగే నటి కోసం నేను చాలా అన్వేషించాను. చివరికి ఆ కెపాసిటీ నాకు కనిపించింది నూతన నటి నైనా గంగూలిలో’’ అని చెప్పారు.