Telugu Global
Cinema & Entertainment

ఆ మ‌జానే వేరు

ఖాళీ స‌మ‌యం దొరికితే సెలిబ్రిటీలు ఏం చేస్తుంటారో అనుకుంటాం క‌దా..! నెల‌ల త‌ర‌బ‌డి షూటింగ్ లతో ఇంటికి దూరంగా ఉంటారు వీరంతా. ఇలా కాస్త గ్యాప్ దొరికితే చాలా మంది తమ‌ కుటుంబ స‌భ్యులతో ఇంటివద్దే గ‌డ‌ప‌డానికే ఇష్ట ప‌డతామని అంటుంటారు. అయితే ఇపూడీ కేట‌గిరిలోకి రాసి ఖ‌న్నా కూడా వచ్చేసింది. ఈ ముద్దుగుమ్మ‌ గృహమే క‌దా స్వ‌ర్గ‌సీమ అంటోంది. చిన్న‌ప్పుడు ఈ అమమ్డు ఇంట్లో గ‌డ‌పడం అంటే బోర్ అనిపించేద‌ట‌. ఫ్రెండ్స్ తో క‌ల‌సి ఎప్పుడు […]

ఆ మ‌జానే వేరు
X

ఖాళీ స‌మ‌యం దొరికితే సెలిబ్రిటీలు ఏం చేస్తుంటారో అనుకుంటాం క‌దా..! నెల‌ల త‌ర‌బ‌డి షూటింగ్ లతో ఇంటికి దూరంగా ఉంటారు వీరంతా. ఇలా కాస్త గ్యాప్ దొరికితే చాలా మంది తమ‌ కుటుంబ స‌భ్యులతో ఇంటివద్దే గ‌డ‌ప‌డానికే ఇష్ట ప‌డతామని అంటుంటారు. అయితే ఇపూడీ కేట‌గిరిలోకి రాసి ఖ‌న్నా కూడా వచ్చేసింది. ఈ ముద్దుగుమ్మ‌ గృహమే క‌దా స్వ‌ర్గ‌సీమ అంటోంది. చిన్న‌ప్పుడు ఈ అమమ్డు ఇంట్లో గ‌డ‌పడం అంటే బోర్ అనిపించేద‌ట‌. ఫ్రెండ్స్ తో క‌ల‌సి ఎప్పుడు బ‌య‌ట‌కు చెక్కేద్దామా అని మన‌సు త‌హ త‌హ లాడేద‌ట‌.

కానీ పెద్ద అవుతున్నా కొద్ది రాసి ఖన్నాకు ఇంటి మీద మ‌మ‌కారం బాగా పెరిగిపోయిందట‌. షూటింగ్ ల నిమిత్తం ఎన్నో కొత్త ప్ర‌దేశాలు తిరుగుతున్న‌ప్ప‌టికి.. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అనిపిస్తుంటుంద‌ట‌. మొన్న‌టి వ‌ర‌కు ఢిల్లి లో ఇల్లు ఉండేది. ఈ మ‌ధ్య హైద‌రాబాద్ లోకూడా ఒక ఇంటిని కొన్నార‌ట‌. షూటింగ్ అవ్వ‌గానే ఇంటికి వ‌చ్చేసి.. టీవి ఆన్ చేసుకోవ‌డ‌మో.. లేదంటే ఒక మంచి పుస్త‌కం చదవటంలో ఉండే ఆ మ‌జానే వేరు అంటోంది . ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ ఆక్సిజ‌న్.. సుప్రీమ్ వంటి చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉంది మ‌రి.

First Published:  2 March 2016 7:17 AM IST
Next Story