Telugu Global
NEWS

"రాజధాని దురాక్రమణ"పై కన్నేసిన ప్రధాని కార్యాలయం!

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, టీడీపీ ఎంపీ మురళీమోహన్,  కేంద్రమంత్రి సుజనా చౌదరి, మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, రావెల కిషోర్‌ బాబు తదితరులు కలిసి అమరావతిలో భూదోపిడికి పాల్పడ్డారంటూ సాక్షి పత్రిక ప్రచురించిన కథనం ప్రకంపనలు సృష్టిస్తోంది.  రాజధాని ఎక్కడ స్థాపించబోతున్నది ముందే తెలుసుకున్న టీడీపీ నేతలు కారుచౌకగా అక్కడ భూములు కొనేశారు. అనంతరం అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారంటూ సాక్షి పత్రిక సాక్ష్యాదారాలతో కథనాన్ని రాసింది. ఇలా చేయడం ద్వారా […]

రాజధాని దురాక్రమణపై కన్నేసిన ప్రధాని కార్యాలయం!
X

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, టీడీపీ ఎంపీ మురళీమోహన్, కేంద్రమంత్రి సుజనా చౌదరి, మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, రావెల కిషోర్‌ బాబు తదితరులు కలిసి అమరావతిలో భూదోపిడికి పాల్పడ్డారంటూ సాక్షి పత్రిక ప్రచురించిన కథనం ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజధాని ఎక్కడ స్థాపించబోతున్నది ముందే తెలుసుకున్న టీడీపీ నేతలు కారుచౌకగా అక్కడ భూములు కొనేశారు. అనంతరం అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారంటూ సాక్షి పత్రిక సాక్ష్యాదారాలతో కథనాన్ని రాసింది. ఇలా చేయడం ద్వారా వేల కోట్ల రూపాయల భూములను కొల్లగొట్టారని కథనం. మరిన్ని కథనాలు ప్రచురిస్తామని కూడా వెల్లడించింది.

స్టేట్‌లో సంచలనం అయిన ఈ కథనంపై ప్రధాని కార్యాలయం కూడా ఆరా తీసిందని వార్తలు వస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థల్లో దీనిపై కథనాలు వస్తున్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా రంగంలోకి దిగిందని చెబుతున్నారు. ఎవరెవరు ఎంతెంత భూమిని తీసుకున్నారు… వాటి విలువ ఎన్ని కోట్లు వంటి అంశాలపై పీఎంఓ ఆరా తీసినట్టు చెబుతున్నారు. కొందరు బీజేపీ నేతల ద్వారా కూడా వివరాలను ఢిల్లీ పెద్దలు ఆరా తీశారని కథనాలు వస్తున్నాయి. టీడీపీ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కొందరు బీజేపీ నేతలు ఉదయమే సాక్షి పత్రిక కథనాన్ని తర్జుమాతో సహా ఢిల్లీ పెద్దలకు చేరవేశారని చెబుతున్నారు. సాధారణంగా ఇలా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు సహజంగానే కేంద్రం ఆరా తీస్తుంది. అయితే ఇంత భారీ కుంభకోణం విషయంలో కేంద్రం ఆరా తీయడంతో సరిపెడుతుందా లేక చర్యలకు దిగుతుందో చూడాలి.

Click on image to read:

jagan1

lokesh

chandrababu

ramoji-undavalli

MLC-Narayana

dulipala

ganta-chandrababu

mininster-Narayana

tdp-ysrcp

tdp

narayana

sakshi

cbn-satrucharla

varla-ramaiah

purandeshwari

tdp-bjp

ysrcp-mla's

jagan-adi-chandrababu

bireddy

First Published:  2 March 2016 1:26 PM IST
Next Story