నిద్ర తగ్గితే...రుచులపై కోరిక పెరుగుతుంది!
నిద్ర కరువైతే బరువెక్కుతారని ఇప్పటివరకు కొన్ని పరిశోధనలు రుజువుచేశాయి. అయితే అందుకు కారణం ఏమిటో ఇప్పుడు చికాగో యూనివర్శిటీ పరిశోధకులు తేల్చారు. నిద్ర తక్కువైనపుడు ఎవరికైనా చాలా రుచికరమైన ఆహారాన్ని తీసుకోవాలనే కోరిక బలంగా ఉంటుందట. డ్రగ్స్ తీసుకోవాలనిపించేంత తీవ్రంగా ఈ తినాలనిపించే కోరిక ఉంటుందట. డయాబెటిస్, మెటబాలిజం, ఎండోక్రినాలజీలకు సంబంధించి జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు తేలాయని యూనివర్శిటీ ఒక నివేదికలో తెలిపింది. తక్కువ నిద్ర పోతే ఎక్కువ ఆహారం, అదీ ఆరోగ్యానికి హానిచేసే రుచికరమైన […]
నిద్ర కరువైతే బరువెక్కుతారని ఇప్పటివరకు కొన్ని పరిశోధనలు రుజువుచేశాయి. అయితే అందుకు కారణం ఏమిటో ఇప్పుడు చికాగో యూనివర్శిటీ పరిశోధకులు తేల్చారు. నిద్ర తక్కువైనపుడు ఎవరికైనా చాలా రుచికరమైన ఆహారాన్ని తీసుకోవాలనే కోరిక బలంగా ఉంటుందట. డ్రగ్స్ తీసుకోవాలనిపించేంత తీవ్రంగా ఈ తినాలనిపించే కోరిక ఉంటుందట. డయాబెటిస్, మెటబాలిజం, ఎండోక్రినాలజీలకు సంబంధించి జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు తేలాయని యూనివర్శిటీ ఒక నివేదికలో తెలిపింది.
తక్కువ నిద్ర పోతే ఎక్కువ ఆహారం, అదీ ఆరోగ్యానికి హానిచేసే రుచికరమైన ఫుడ్ తింటారని, తద్వారా బరువు పెరుగుతారని ఇప్పటికే కొన్ని అధ్యయనాల్లో తేలినా ఎందుకు అలా చేస్తారో వెల్లడి కాలేదు. కానీ ప్రస్తుత పరిశోధనల్లో నిద్ర తక్కువైతే బ్లడ్‌లో కొన్ని రకాల రసాయనాల సంకేతాలు పెరుగుతున్నట్టుగా గమనించారు. ఇవి ఆనందాన్నిచ్చే ఆహారాన్ని తీసుకునేందుకు పురికొల్పుతాయి. అందుకే స్వీట్లు, ఉప్పు, కొవ్వు అధికంగా ఉన్న స్నాక్స్ ఈ సమయంలో ఎక్కువగా తీసుకుంటారని ఈ అధ్యయనంలో తేలింది.
సరిపడా నిద్రలేనపుడు కడుపు నిండా ఆహారం తిన్నా కాని, అదనంగా స్నాక్స్ తీసుకోవడం కొంతమంది వలంటీర్లలో పరిశోధకులు గమనించారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం తరువాత ఇలాంటి కోరిక మరింత పెరుగుతున్నట్టుగా గుర్తించారు. మొత్తానికి నిద్ర తక్కువైతే రుచికరమైన ఫుడ్ విషయంలో మనం కంట్రోల్‌లో ఉండలేమని పరిశోధకులు తేల్చారు.