మంత్రి గంటాపై కేబినెట్‌లో బాబు సీరియస్!
సీఎం చంద్రబాబునాయుడు కేబినెట్ మంత్రులతో విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. రాజధాని భూములపై మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న మంత్రులతో ఈ సమావేశం ఏర్పాటుచేశారు.సాక్షి పత్రికలో “రాజధాని దురాక్రమణ” అంటూ వచ్చిన కథనాల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సరిగ్గా స్పందించకపోవడంపై బాబు మండిపడ్డారు. ఇలాంటి కథనాలకు ధీటైన సమాధానం చెప్పకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మంత్రి గంటాపై […]

సీఎం చంద్రబాబునాయుడు కేబినెట్ మంత్రులతో విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. రాజధాని భూములపై మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న మంత్రులతో ఈ సమావేశం ఏర్పాటుచేశారు.సాక్షి పత్రికలో “రాజధాని దురాక్రమణ” అంటూ వచ్చిన కథనాల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సరిగ్గా స్పందించకపోవడంపై బాబు మండిపడ్డారు. ఇలాంటి కథనాలకు ధీటైన సమాధానం చెప్పకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో మంత్రి గంటాపై చంద్రబాబు సీరియస్ అయ్యారని సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య తనపై చేసిన విమర్శలపై ఎందుకు స్పందించలేదని గంటాపై మండిపడ్డారని తెలుస్తోంది. మంత్రిగంటా కూడా కాపు సామాజిక వర్గానికే చెందినవ్యక్తి కావడంతో అదే సమాజిక వర్గానికి చెందిన సి. రామచంద్రయ్యపై ఆయనను ప్రయోగించడమే సరైనదని బాబు భావించివుండవచ్చు. మంగళవారం మీడియాతో మాట్లాడిన రామచంద్రయ్య చంద్రబాబు… ఒక యూస్ లెస్ చీఫ్ మినిస్టర్ అని తీవ్రవ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కోవడంలో విఫలమయ్యారని ఇతర మంత్రులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారట. కాపునేత ముద్రగడ పద్మనాభం లేఖపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ముద్రగడ విమర్శలకు ధీటుగా ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని కాపునాయకులను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ముద్రగడ లేఖ వెనుక జగన్ హస్తం ఉందని సమావేశంలో చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. ముద్రగడ, మందకృష్ణ చెప్పినట్టు ప్రభుత్వం నడవదని, తమకంటూ ఒక విధానం ఉందని చంద్రబాబు సమావేశంలో అసహనం వ్యక్తం చేశారు. ఇకపై విపక్షాల విమర్శలకు తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేయాలని మంత్రులకు చంద్రబాబు హుకుం జారీచేశారని సమాచారం.
Click on image to read: