ఎమ్మెల్యేలపైనే ఫోకస్ ఎందుకు?
అవినీతి సొమ్ముతో చంద్రబాబుకు ఎమ్మెల్యేలను కొంటుంటే కొన్ని మీడియా సంస్థలు వంతపాడుతున్నాయని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న తప్పులను మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. సోమవారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారంటూ ఒక పత్రిక కథనాన్ని రాయడంపై శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తప్పుడు కథనాలు రాసిన పత్రికలపై పరువు నష్టం దావా వేయాలని పార్టీ నిర్ణయించినట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేల సమావేశంలో ప్రజాసమస్యలపై చర్చిస్తే […]
అవినీతి సొమ్ముతో చంద్రబాబుకు ఎమ్మెల్యేలను కొంటుంటే కొన్ని మీడియా సంస్థలు వంతపాడుతున్నాయని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న తప్పులను మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. సోమవారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారంటూ ఒక పత్రిక కథనాన్ని రాయడంపై శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తప్పుడు కథనాలు రాసిన పత్రికలపై పరువు నష్టం దావా వేయాలని పార్టీ నిర్ణయించినట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యేల సమావేశంలో ప్రజాసమస్యలపై చర్చిస్తే ఆ విషయం రాయకుండా …ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారంటూ కథనాలు రాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సమావేశానికి ఎందువల్ల ఎమ్మెల్యేలు హాజరు కాలేదో కూడా రాసి ఉంటే ఆహ్వానించేవారిమన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మాల వేసి పాదయాత్రలో ఉన్నారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు . జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కూడా డుమ్మా కొట్టారంటూ రాయడం ఏమిటని ప్రశ్నించారు. సుజయ కృష్ణరంగారావు, తిప్పారెడ్డిలు విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు.
సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరును కూడా రాయడాన్ని ఏమనుకోవాలని మీడియా తీరుపై శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉన్నదే కేరెక్టర్ అని చెప్పుకునే చంద్రబాబు కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. దీన్ని మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. తెలంగాణలో ఎమ్మెల్యేలు పార్టీ మారుతుంటే ఖండించిన మీడియా సంస్థలు ఇప్పుడు ఏపీలో జరుగుతున్న తంతును ఎందుకు తప్పుపట్టడం లేదని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.
Click on image to read: