ఎన్టీఆర్ సినిమాకు ప్రభుదేవా స్టెప్పులు
నిజమే… ఇప్పుడీ విషయాన్ని కాస్త ఘనంగానే చెప్పుకోవాలి. కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కాస్తా దర్శకుడు ప్రభుదేవాగా ఎప్పుడో మారిపోయాడు. తెలుగు, తమిళ భాషలతో పాటు ఏకంగా బాలీవుడ్ లో కూడా ఘనమైన విజయాలందించాడు. ఒక్కముక్కలో చెప్పాలంటే అప్పట్లో చప్పగా సాగుతున్న సల్మాన్ కెరీర్ కు మళ్లీ ఊపుతెచ్చింది ప్రభుదేవానే. మరి ఇలాంటి దర్శకుడు స్టెప్పులెందుకేస్తాడు చెప్పండి. పూర్తిగా మెగాఫోన్ పట్టుకోవడానికే ఫిక్స్ అయిపోయిన ప్రభుదేవా… అప్పుడప్పుడు మాత్రం తనలోని డాన్స్ టాలెంట్ ను చూపిస్తుంటాడు. అది కూడా తను […]
BY admin1 March 2016 2:47 AM IST
X
admin Updated On: 1 March 2016 8:20 AM IST
నిజమే… ఇప్పుడీ విషయాన్ని కాస్త ఘనంగానే చెప్పుకోవాలి. కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కాస్తా దర్శకుడు ప్రభుదేవాగా ఎప్పుడో మారిపోయాడు. తెలుగు, తమిళ భాషలతో పాటు ఏకంగా బాలీవుడ్ లో కూడా ఘనమైన విజయాలందించాడు. ఒక్కముక్కలో చెప్పాలంటే అప్పట్లో చప్పగా సాగుతున్న సల్మాన్ కెరీర్ కు మళ్లీ ఊపుతెచ్చింది ప్రభుదేవానే. మరి ఇలాంటి దర్శకుడు స్టెప్పులెందుకేస్తాడు చెప్పండి. పూర్తిగా మెగాఫోన్ పట్టుకోవడానికే ఫిక్స్ అయిపోయిన ప్రభుదేవా… అప్పుడప్పుడు మాత్రం తనలోని డాన్స్ టాలెంట్ ను చూపిస్తుంటాడు. అది కూడా తను దర్శకత్వం వహించే సినిమాల్లో కొన్ని పాటలకే స్టెప్పులు సమకూర్చేవాడు. కానీ చాన్నాళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో ఓ సినిమాకు నృత్యదర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నాడు ప్రభుదేవా. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న జనతా గ్యారేజీ సినిమాలో ఓ పాటకు కొరియోగ్రఫీ చేయడానికి ప్రభుదేవా అంగీకరించాడు. చిరంజీవి తర్వాత అంత అద్భుతంగా స్టెప్పులు వేసేది ఎన్టీఆర్ మాత్రమే అంటూ గతంలో ప్రభుదేవా ప్రకటించాడు. మరి జనతా గ్యారేజీలోని ఓ పాటలో ఎన్టీఆర్ ను ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి.
Next Story