చంద్రబాబు తనను తాను ఓదార్చుకున్నారు!
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్ర ప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని ఒక వైపు ప్రతిపక్షాలు, మీడియా స్పష్టంగా చెబుతుంటే చంద్రబాబు నాయుడు ఆ నష్టం తీవ్రతని తగ్గించే ప్రయత్నాన్ని చేశారు. రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న బిజెపి కేంద్రంలో తెలుగుదేశం పాలిట ప్రతిపక్షంగా మారిందన్న విమర్శలకు ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులు మరింతగా ఊతమిచ్చినట్లయ్యింది. రాజధాని నిర్మాణంకోసం 4వేల కోట్లు, పోలవరంకోసం 4వేల కోట్లు ఇవ్వాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరితే కేంద్రం పట్టించుకోలేదు. పోలవరానికి 100కోట్లు, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకి […]
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్ర ప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని ఒక వైపు ప్రతిపక్షాలు, మీడియా స్పష్టంగా చెబుతుంటే చంద్రబాబు నాయుడు ఆ నష్టం తీవ్రతని తగ్గించే ప్రయత్నాన్ని చేశారు. రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న బిజెపి కేంద్రంలో తెలుగుదేశం పాలిట ప్రతిపక్షంగా మారిందన్న విమర్శలకు ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులు మరింతగా ఊతమిచ్చినట్లయ్యింది. రాజధాని నిర్మాణంకోసం 4వేల కోట్లు, పోలవరంకోసం 4వేల కోట్లు ఇవ్వాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరితే కేంద్రం పట్టించుకోలేదు. పోలవరానికి 100కోట్లు, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకి 100 కోట్లు, విశాఖ మెట్రో ప్రాజెక్టుకు 3లక్షలు… ఇలా చిల్లరగా విదల్చడం తప్ప రాజధాని నిర్మాణం అనే విషయంలో కేంద్రం ఈ బడ్జెట్‌లోనూ ఏ మాత్రం స్పందించలేదు.
ప్రత్యేక హోదా ప్రకటించి ఉంటే ఈ ఏడాది రాష్ట్రం నుండి కేంద్రానికి పన్నుల రూపంలో వెళుతున్న 24,500కోట్ల ఆదాయాన్నయినా రాష్ట్రమే వినియోగించుకునే అవకాశం ఉండేది. అది కూడా లేకుండా పోయింది. బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై చంద్రబాబు స్పందనలో ఏ మాత్రం ఆవేదన లేకపోగా తననితాను ఓదార్చుకున్నట్టుగా ఉందనే ఆగ్రహం ప్రజల్లో కనబడుతోంది.
రాష్ట్రానికి న్యాయం జరగలేదు..అని ఒప్పుకున్న చంద్రబాబు అరుణ్‌జైట్లీతో మాట్లాడామని రంగాలవారీగా కేటాయింపులు ఉంటాయని అన్నారని చెప్పారు. ఈ సంవత్సరం చివరికల్లా పెడింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని జైట్లీ చెప్పారన్నారు. అయితే దేశవ్యాప్తంగా 200పైగా పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని, కేటాయింపులు వెయ్యి కోట్లని, ఇందులో మనకు వచ్చేదెంత అని వైఎస్సార్ పార్టీ విమర్శిస్తోంది.
బడ్టెట్‌పై ఎలా స్పందించాలన్న విషయంపై పోలీట్ బ్యూరో సమావేశం జరిపిన చంద్రబాబు, కేంద్రంపై కోపాన్ని కక్కలేక మింగలేక వున్నాడు. గతంలో కేంద్రం ఇచ్చిన డబ్బును ఇష్టమొచ్చినట్లు ఖర్చుపెట్టేసి వాటికి లెక్కలు చెప్పలేక, కొన్ని కేసుల్లో ఇరుక్కుని కేంద్రం దయా దాక్షిణ్యాలతో బయటపడ్డ చంద్రబాబుకు కేంద్రం వైపు కన్నెత్తి చూసే దైర్యం లేదు. కేంద్రం దయతో నెట్టుకొస్తున్న చంద్రబాబు కేంద్రాన్ని విమర్శించే దైర్యం చేయలేడు. అందుకే బయటకు వచ్చి ఎప్పటిలాగే కేంద్రంపై మాట తూలకుండా తనని తాను సంబాళించుకున్నారు. అంతకుముందు యనమల రామకృష్ణుడు, కేంద్రమంత్రి కనుక సుజనా చౌదరికి బడ్జెట్ బాగుందేమో కానీ మాకు కాదు…అన్నారు. ఆ మాత్రం తీవ్రత కూడా చంద్రబాబు స్పందనలో కనిపించలేదు. ఎప్పటిలాగే రాష్ట్రవిభజన తరువాత కష్టాలున్నాయని, అభివృద్ధి సాధిస్తామని, అందరికీ అవకాశాలు ఉంటాయని…ఇలాంటి మాటలతో అసలు విషయాన్ని దాటేశారు.
చంద్రబాబు వైఖరి ప్రత్యేక హోదాపై ఆశలు పెట్టుకున్న ప్రజల్లో మరింత నిరాశని నింపిందన్న అభిప్రాయం మరోసారి వినబడుతోంది. ఏదిఏమైనా ఈ బడ్జెట్‌తో మరొకసారి చంద్రబాబు పరుగులకు మోడీ బ్రేకులు వేసినట్లయింది.
Click on image to read: