టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించిన మరో వైసీపీ ఎమ్మెల్యే
టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే పార్టీ వీడుతున్నట్టు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే వెంకటరమణ తాను టీడీపీలో చేరుతున్నట్టు వెల్లడించారు. తన తండ్రి మోహన్‌రావుతోపాటు పార్టీ వీడుతున్నట్టు చెప్పారు. ఈయన కూడా అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. వెంకటరమణలో గతంలో టీడీపీలో పనిచేశారు. పదేళ్లపాటు టీడీపీలో ఉన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనూ అప్పట్లో టీడీపీని వీడాల్సి వచ్చిందన్నారు. ఈనెల 4వ తేదీన కార్యకర్తలతో కలిసి టీడీపీలో చేరుతానన్నారు. వెంకటరమణ […]

టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే పార్టీ వీడుతున్నట్టు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే వెంకటరమణ తాను టీడీపీలో చేరుతున్నట్టు వెల్లడించారు. తన తండ్రి మోహన్‌రావుతోపాటు పార్టీ వీడుతున్నట్టు చెప్పారు. ఈయన కూడా అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. వెంకటరమణలో గతంలో టీడీపీలో పనిచేశారు. పదేళ్లపాటు టీడీపీలో ఉన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనూ అప్పట్లో టీడీపీని వీడాల్సి వచ్చిందన్నారు. ఈనెల 4వ తేదీన కార్యకర్తలతో కలిసి టీడీపీలో చేరుతానన్నారు. వెంకటరమణ పార్టీ మారుతారని చాలా కాలంగా వార్తలొస్తున్నాయి. వెంకటరమణ టీడీపీలో చేరితే జంప్ చేసిన ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకు చేరుతుంది.
Click on image to read: