చొక్కాలు చించుకుని కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు
గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగు తమ్ముళ్లు కొట్టుకున్నారు. తెనాలి కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు కౌన్సిలర్లు ఎగిరెగిరి తన్నుకున్నారు. బూతులు తిట్టుకుంటూ తలబడ్డారు. చొక్కాలు చించుకున్నారు. ఎక్కువ మట్లాడితే చెప్పుతో కొడతా అంటూ వార్నింగ్లు ఇచ్చుకున్నారు. పచ్చిబూతులు తిట్టుకున్నారు. మిగిలిన టీడీపీ నేతలు వీరిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అందరినీ పక్కకు తోసేసి తన్నుకున్నారు. స్టాండింగ్ కమిటీల ఏర్పాటు విషయంలో వివాదం చెలరేగింది. కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తులు, గుమ్మడి రమేష్ తన్నుకుంటున్న సమయంలో మహిళ కౌన్సిలర్లు […]
గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగు తమ్ముళ్లు కొట్టుకున్నారు. తెనాలి కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు కౌన్సిలర్లు ఎగిరెగిరి తన్నుకున్నారు. బూతులు తిట్టుకుంటూ తలబడ్డారు. చొక్కాలు చించుకున్నారు. ఎక్కువ మట్లాడితే చెప్పుతో కొడతా అంటూ వార్నింగ్లు ఇచ్చుకున్నారు. పచ్చిబూతులు తిట్టుకున్నారు. మిగిలిన టీడీపీ నేతలు వీరిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అందరినీ పక్కకు తోసేసి తన్నుకున్నారు. స్టాండింగ్ కమిటీల ఏర్పాటు విషయంలో వివాదం చెలరేగింది. కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తులు, గుమ్మడి రమేష్ తన్నుకుంటున్న సమయంలో మహిళ కౌన్సిలర్లు పరుగులు తీశారు. చివరకు వైసీపీ సభ్యులు వెళ్లి ఇద్దరిని విడిపించారు. బీసీ వర్గానికి చెందిన త్రిమూర్తులపై దాడి చేయడాన్ని పలువురు ఖండిస్తున్నారు. గొడవపై కౌన్సిలర్లును పిలిపించుకుని ఎమ్మెల్యే రాజా మాట్లాడారు. కేసులు లేకుండా వివాదం పెద్దది కాకుండా సర్ధిచెప్పేందుకు ప్రయత్నించారు.
Click on image to read: