మేం భయపడడం లేదు , సీఎం చెబితే మేం రెడీ
వైసీపీని వీడి తండ్రితో పాటు వైసీపీలో చేరిన భూమా అఖిల ప్రియ .. పార్టీ మారుతామని తాను కూడా ఊహింలేదన్నారు. పార్టీ మారడంపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ పార్టీలు మారడం అన్నది తమతోనే ప్రారంభం కాలేదన్నారు. ఇప్పుడు కూడా చాలా మంది పార్టీలు మారుతున్నారని చెప్పారు. జగన్ మీద తమకు ఒక్క శాతం కూడా కోపం లేదని అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారకతప్పలేదన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం తాము పార్టీ మారలేదన్నారు. తమను నమ్ముకుని […]
వైసీపీని వీడి తండ్రితో పాటు వైసీపీలో చేరిన భూమా అఖిల ప్రియ .. పార్టీ మారుతామని తాను కూడా ఊహింలేదన్నారు. పార్టీ మారడంపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ పార్టీలు మారడం అన్నది తమతోనే ప్రారంభం కాలేదన్నారు. ఇప్పుడు కూడా చాలా మంది పార్టీలు మారుతున్నారని చెప్పారు. జగన్ మీద తమకు ఒక్క శాతం కూడా కోపం లేదని అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారకతప్పలేదన్నారు.
వ్యక్తిగత అవసరాల కోసం తాము పార్టీ మారలేదన్నారు. తమను నమ్ముకుని లక్షలాది మంది ఉన్నారని వారికి న్యాయం చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎన్నికలకు తాము భయపడడం లేదన్నారు. చంద్రబాబు కోరితే వెంటనే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమ కుటుంబంపై ఎంతో నమ్మకంతో జనం ఓట్లేశారని చెప్పారు. శోభనాగిరెడ్డి బతికి ఉంటే పార్టీ మారడంపై ఎలా స్పందించేవారో తనకు తెలియదని.. అయితే అమ్మ ఎలా ఆలోచిస్తారో నాన్నకు బాగా తెలుసని, కాబట్టి అమ్మ కూడా ఇదే పనిచేసే వారు కాబోలు అన్నారు.
మంత్రి పదవిపై ఎలాంటి కమిట్మెంట్ లేదన్నారు. ప్రజల కోసమే పార్టీ మారామని మంత్రి పదవి ఆశించి మాత్రం కాదన్నారు. ఒక సాధారణ ఎమ్మెల్యే కంటే తనపై అధిక ఒత్తిడి ఉందని చెప్పారు. పైగా ఇప్పుడు అధికారపక్షంలోకి వచ్చాం కాబట్టి సమస్యల పరిష్కారం కోసం మరింత హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందన్నారు. ఆళ్లగడ్డలోగాని, జిల్లాలో గాని ఇప్పుడు ఫ్యాక్షన్ లేదని చెప్పారు. తన కుటుంబంలో చెల్లితో పాటు తమ్ముడికి కూడా రాజకీయాలపై ఆసక్తి ఉందని చెప్పారు. చిన్నప్పటి నుంచి రాజకీయాలకు దగ్గరగా ఉండడంతో అందరికీ ఆ రంగంపై ఆసక్తి పెరిగిందన్నారు.
జగన్ కుటుంబంతో తమకు ఎంతో అనుబంధం ఉందన్నారు. జగన్ తనకు, తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. భవిష్యత్తులో తిరిగి మారే అంశంపై తాను ఇప్పుడేమీ స్పందించలేనన్నారు. జగన్ రెచ్చగొట్టడం వల్లే చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారని తాను అనుకోవడం లేదన్నారు. మరికొందరు ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకొచ్చి పాయింట్లు కొట్టేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.
Click on image to read: