కేజ్రివాల్ కారుపై కర్రలు, రాళ్లతో దాడి
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై దాడి జరిగింది. ఆయన కారుపై కొందరు వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దాడి నుంచి తాను స్వల్ప గాయాలతో బయటపడ్డానని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. దాడితో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ ఫోటోలను ఆప్ నేతలు ట్వీట్ చేశారు. కేజ్రీ పంజాబ్ పర్యటన సమయంలో ఈ దాడి జరిగింది. ఈ దాడి వెనుక సీఎం బాదల్ వర్గీయుల హస్తముందని ఢిల్లీ సీఎం అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులతో తమలోని స్పూర్తిని […]
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై దాడి జరిగింది. ఆయన కారుపై కొందరు వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దాడి నుంచి తాను స్వల్ప గాయాలతో బయటపడ్డానని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. దాడితో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ ఫోటోలను ఆప్ నేతలు ట్వీట్ చేశారు. కేజ్రీ పంజాబ్ పర్యటన సమయంలో ఈ దాడి జరిగింది. ఈ దాడి వెనుక సీఎం బాదల్ వర్గీయుల హస్తముందని ఢిల్లీ సీఎం అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులతో తమలోని స్పూర్తిని అడ్డుకోలేరని కేజ్రీవాల్ అన్నారు.
ఇనుప రాడ్లు, రాళ్లతో సాయుధులైన వ్యక్తులు ఆయనపై దాడికి దిగి కారును ధ్వంసం చేశారని ఆప్ నేత అశిష్ ట్విట్టర్‌లో వెల్లడించారు. బాదల్ కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. బాదల్ గూండాలు తమ నేతపై దాడిచేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకున్నారని ఆరోపించారు. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఆప్ అధినేత పంజాబ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సమయంలోనే దాడి జరిగింది.
In a well orchestrated attack the goons sent by Badals attacked Kejriwal's car with stones & rods as police stood by pic.twitter.com/5fjyumO1JD
— Ashish Khetan (@AashishKhetan) February 29, 2016
My car attacked with sticks and stones in Ludhiana. Front glass pane broken. Badals n congress nervous? They can't break my spirits
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 29, 2016