కాపలాదారే… దొంగయ్యాడు!
ఇంటిముందు కాపలా కాసే వాచ్‌మ్యానే ఇంట్లో దొంగతనం చేస్తాడని పాపం ఆ కుటుంబం ఊహించి ఉండదు. తిరుపతికి చెందిన బాలాజీ (33) అమీర్‌పేటలోని గ్రీన్‌ల్యాండ్ టవర్స్‌కి వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఓ ఫ్లాట్‌లోని వారు ఒరిజినల్ కీల్లో ఒకదాన్ని పోగొట్టుకోగా అది అతనికి దొరికింది. దాన్ని సొంతదారులకు ఇవ్వకుండా బాలాజీ దాచుకున్నాడు. తరువాత ఫ్లాట్‌వారు ఊరు వెళ్లగా దర్జాగా తాళం తీసి ఇంట్లోకి వెళ్లి 15తులాల బంగారం అయిదు తులాలు వెండి దోచుకున్నాడు. బాధితులు […]
ఇంటిముందు కాపలా కాసే వాచ్‌మ్యానే ఇంట్లో దొంగతనం చేస్తాడని పాపం ఆ కుటుంబం ఊహించి ఉండదు. తిరుపతికి చెందిన బాలాజీ (33) అమీర్‌పేటలోని గ్రీన్‌ల్యాండ్ టవర్స్‌కి వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఓ ఫ్లాట్‌లోని వారు ఒరిజినల్ కీల్లో ఒకదాన్ని పోగొట్టుకోగా అది అతనికి దొరికింది. దాన్ని సొంతదారులకు ఇవ్వకుండా బాలాజీ దాచుకున్నాడు. తరువాత ఫ్లాట్‌వారు ఊరు వెళ్లగా దర్జాగా తాళం తీసి ఇంట్లోకి వెళ్లి 15తులాల బంగారం అయిదు తులాలు వెండి దోచుకున్నాడు.
బాధితులు టి చంద్రశేఖరరావు, ఆయన భార్య నీలిమ పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. పోలీసుల విచారణలో బాలాజీ అసలు నిజాలు బయటపెట్టాడు. కొన్ని రోజుల క్రితం చంద్రశేఖర్ రావు చిన్నకుమారుడు లిఫ్ట్ వద్ద తాళాలు పడేసుకున్నాడు. వాటిని బాలాజీ తీసి దాచాడు. తాళాల గురించి ఆ కుటుంబం వారు అడగ్గా తనకు తెలియదన్నాడు. తరువాత చంద్రశేఖర రావు కుటుంబం ఊరికి వెళ్లగా దొంగతనం చేశాడు. పోలీసుల విచారణలో బాలాజీకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టుగా వెల్లడయింది. అతడిని అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండ్‌కి తరలించారు.