రోజా చదువెంత?, గాలి వయసెంత?
ఇటీవల చంద్రబాబు ఇంగ్లీష్‌ను పలువురు పదేపదే అవహేళన చేస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. చంద్రబాబు ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని రోజా ఎద్దేవ చేయడంపై టీడీపీ ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ఆంగ్ల పరిజ్ఞానం గురించి రోజాకేం తెలుసని మండిపడ్డారు. ఎంఏ చదివిన చంద్రబాబును పదో తరగతి చదివిన రోజా విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి అమెరికా అధ్యక్షుడు, మైక్రోసాప్ట్ అధినేతలను మెప్పించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని […]
ఇటీవల చంద్రబాబు ఇంగ్లీష్‌ను పలువురు పదేపదే అవహేళన చేస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. చంద్రబాబు ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని రోజా ఎద్దేవ చేయడంపై టీడీపీ ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ఆంగ్ల పరిజ్ఞానం గురించి రోజాకేం తెలుసని మండిపడ్డారు. ఎంఏ చదివిన చంద్రబాబును పదో తరగతి చదివిన రోజా విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు.
హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి అమెరికా అధ్యక్షుడు, మైక్రోసాప్ట్ అధినేతలను మెప్పించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారన్నారు. రోజాకు రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు అని గాలి అన్నారు.
గాలి వ్యాఖ్యలపై రోజా కూడా తీవ్రంగా స్పందించారు. గాలి ముద్దుకృష్ణమకు వయసు మీద పడి 60 ఏళ్లు దాటే సరికి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. గాలికి ఎక్స్‌పెయిరీ డేట్ అయిపోయిందన్నారు. ముద్దుకృష్ణమకు ఎమ్మెల్సీ వచ్చిందంటే అది తాను పెట్టిన భిక్షేనన్నారు రోజా. జిల్లాలో తనను బూచిగా చూపెట్టి చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్సీ తెచ్చుకున్న వ్యక్తి గాలి ముద్దుకృష్ణమనాయుడని రోజా మండిపడ్డారు.
Click on image to read: