ఆమెని... పుట్టింటివారే కిడ్నాప్ చేశారు!
ఇష్టంలేని పెళ్లి చేసుకుందన్న కోపంతో కూతురిని అల్లుడి వద్దనుండి బలవంతంగా తీసుకెళ్లారు ఆమె పుట్టింటివారు. హైదరాబాద్, కవాడీగూడ ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ (32), లక్ష్మీ ప్రియ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్రీకాంత్ వ్యాపారవేత్త కాగా లక్ష్మీ ప్రియ డిగ్రీ చదువుతోంది. తమ పెళ్లికి ఇరు కుటుంబాల వారూ ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ ఆర్య సమాజంలో శుక్రవారం వివాహం చేసుకున్నారు. కూతురు ఇంట్లోంచి వెళ్లిపోయిందని తెలుసుకున్న ఆ కుటుంబం ఆమె కోసం వెతకడం ప్రారంభించింది. వివాహం తరువాత శ్రీకాంత్ తన కారులో […]

ఇష్టంలేని పెళ్లి చేసుకుందన్న కోపంతో కూతురిని అల్లుడి వద్దనుండి బలవంతంగా తీసుకెళ్లారు ఆమె పుట్టింటివారు. హైదరాబాద్, కవాడీగూడ ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ (32), లక్ష్మీ ప్రియ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్రీకాంత్ వ్యాపారవేత్త కాగా లక్ష్మీ ప్రియ డిగ్రీ చదువుతోంది. తమ పెళ్లికి ఇరు కుటుంబాల వారూ ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ ఆర్య సమాజంలో శుక్రవారం వివాహం చేసుకున్నారు. కూతురు ఇంట్లోంచి వెళ్లిపోయిందని తెలుసుకున్న ఆ కుటుంబం ఆమె కోసం వెతకడం ప్రారంభించింది. వివాహం తరువాత శ్రీకాంత్ తన కారులో ఇంటికి తిరిగి వెళుతుండగా లక్ష్మీ ప్రియ తరపువారు వచ్చి కారుని అడ్డగించారు. కారు అద్దాలు పగుల గొట్టారు. లక్ష్మీ ప్రియని కారులోంచి బయటకు లాగి బలవంతంగా తమతో తీసుకువెళ్లిపోయారు. ఈ మేరకు శ్రీకాంత్ ఫిర్యాదునివ్వగా పోలీసులు లక్ష్మీ ప్రియ కుటుంబంపై కిడ్నాప్, కారుని పగుల గొట్టడం కేసులను నమోదు చేశారు.