బొమ్మరిల్లు కు సీక్వెల్..!
సున్నితమైన మానవ సంబంధాల్ని విశ్లేషిస్తూ సినిమాను విజయ వంతం చేయాలంటే.. దర్శకుడికి ఎంతో ప్రతిభ కావాలి. అటువంటి ప్రతిభ ఒక కొత్త దర్శకుడిలో ఉందనే విషయం క్యాచ్ చేయాలంటే.. ఆ ప్రొడ్యూసర్ కు అంతకు మించి సినిమా కథ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తుందా లేదా అనే విషయం జడ్జ్ చేయగల సమర్ధత ఉండి తీరాలి. అలా ఇద్దరు సమర్ధులు సమన్వయంతో పది సంవత్సరాల క్రితం వచ్చిన బొమ్మరిల్లు చిత్రం ఆడియన్స్ కు గుర్తుండే వుంటుంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా […]
సున్నితమైన మానవ సంబంధాల్ని విశ్లేషిస్తూ సినిమాను విజయ వంతం చేయాలంటే.. దర్శకుడికి ఎంతో ప్రతిభ కావాలి. అటువంటి ప్రతిభ ఒక కొత్త దర్శకుడిలో ఉందనే విషయం క్యాచ్ చేయాలంటే.. ఆ ప్రొడ్యూసర్ కు అంతకు మించి సినిమా కథ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తుందా లేదా అనే విషయం జడ్జ్ చేయగల సమర్ధత ఉండి తీరాలి. అలా ఇద్దరు సమర్ధులు సమన్వయంతో పది సంవత్సరాల క్రితం వచ్చిన బొమ్మరిల్లు చిత్రం ఆడియన్స్ కు గుర్తుండే వుంటుంది.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం సూపర్ హిట్ తో వున్న సిద్దార్ధ్ హీరో గాను.. అలాగే జెనిలీయా హీరోయిన్ .. దర్శకుడు భాస్కర్ డెబ్యూ చిత్రం .. సక్సెస్ ఫుల్ ఫాదర్ గా ఫీల్ అయ్యే ఒక తండ్రి .. తనకు తెలియకుండానే తన కొడుకు లైఫ్ ను డిస్ట్రబ్డ్ చేస్తుంటాడు …తండ్రి డిస్ట్రబ్ కాకూడదని తనలో తాను ఫీల్ అయ్యే కొడుకు.. వీరిద్దరి మధ్య తనకు నచ్చినట్లుండే హీరోయిన్.. ఇలా ముగ్గురు క్యారెక్టర్స్ తో వచ్చిన బొమ్మరిల్లు చిత్రం ఘన విజయం సాధించింది. నటించిన అందరీకి గుర్తింపు వచ్చింది. హీరో , హీరోయిన్ ల కెరీర్ కు జట్ స్పీడ్ ఊపు నిచ్చింది. కట్ చేస్తే ఈ చిత్రానికి త్వరలో దిల్ రాజ్ సీక్వెల్ చేసే ఆలోచన చేస్తున్నట్ల ఆయన కాంపౌండ్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి మరి.