దేశీయ నెయ్యి… కేశాలకు ఔషధం!
జుట్టుకి సంబంధించిన అనేక సమస్యలకు దేశీయ ఆవులనుండి తీసిన నాణ్యమైన నెయ్యి చక్కగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఎలాంటి కెమికల్స్ లేని ఈ నెయ్యితో జుట్టుకి మేలే తప్ప ఏ హానీ ఉండదు. రెండు టేబుల్ స్ఫూన్ల నెయ్యికి ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌ని కలపాలి. దీన్ని నేరుగా తలకు పట్టించి 20 నిముషాల తరువాత ఎక్కువ గాఢతలేని షాంపూతో తలస్నానం చేయాలి. ఇది జుట్టుకి చక్కని కండిషనర్‌గా పనిచేస్తుంది. జుట్టు మృదువుగా మెత్తగా ఉండేలా […]
BY sarvi27 Feb 2016 10:18 AM IST
X
sarvi Updated On: 27 Feb 2016 10:48 AM IST
జుట్టుకి సంబంధించిన అనేక సమస్యలకు దేశీయ ఆవులనుండి తీసిన నాణ్యమైన నెయ్యి చక్కగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఎలాంటి కెమికల్స్ లేని ఈ నెయ్యితో జుట్టుకి మేలే తప్ప ఏ హానీ ఉండదు.
- రెండు టేబుల్ స్ఫూన్ల నెయ్యికి ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌ని కలపాలి. దీన్ని నేరుగా తలకు పట్టించి 20 నిముషాల తరువాత ఎక్కువ గాఢతలేని షాంపూతో తలస్నానం చేయాలి. ఇది జుట్టుకి చక్కని కండిషనర్‌గా పనిచేస్తుంది. జుట్టు మృదువుగా మెత్తగా ఉండేలా చేస్తుంది. -అలాగే నెయ్యిని జుట్టు చివర్లకు రాయడం వలన చిట్లకుండా ఉంటుంది. మూడు స్పూన్ల నెయ్యిని తీసుకుని కేశాల చివర్లకు రాసి, పావుగంట తరువాత చివర్లను దువ్వెనతో దువ్వి, తలస్నానం చేయాలి.
- నెయ్యి వాడితే జుట్టుకి ఉసిరి, ఉల్లిపాయలు వంటివి కూడా అక్కర్లేదు. కనీసం నెలకు రెండుసార్లు రాత్రులు తలకు నెయ్యిని అప్లయి చేసుకుని తెల్లారి తలస్నానం చేయాలి.
- గోరువెచ్చగా ఉన్న నేతిని, బాదంనూనెతో కలిపి తలకు మసాజ్ చేయాలి. పావుగంట తరువాత రోజ్ వాటర్‌తో నేతిని తొలగించుకోవాలి. నెలకు రెండుసార్లు చేస్తుంటే జుట్టులోని పొడిదనం తగ్గుతుంది. అలాగే చుండ్రు కూడా తగ్గిపోతుంది.
Next Story