అతనికి 65...ఆమెకు 12!
న్యూయార్క్‌లోని టైమ్‌స్క్వేర్‌లో ఈ జంట ఇలా పెళ్లి దుస్తుల్లో కనిపించింది. అభివృద్ధి చెందిన అమెరికా దేశపు ప్రజలు ఇలాంటి బాల్య వివాహం పట్ల ఎలా స్పందిస్తారో చూడాలని యూట్యూబ్‌కి చెందిన కాబీ పర్సన్ ఈ ఏర్పాటు చేశాడు, ఈ వరుడు, వధువు ఇద్దరూ నటులే. ఈ జంటని చూసిన న్యూయార్క్ వాసులు నిశ్చేష్టులయ్యారు. కాబీ పర్సన్ ఈ జంటకు ఫొటోగ్రాఫర్‌గా నటించాడు. కనిపించని కెమెరాతో ఆ దారినపోయేవారి హావభావాలను చిత్రించే ఏర్పాటు ముందుగానే చేసుకున్నారు. చాలామంది మొహంలో […]
న్యూయార్క్‌లోని టైమ్‌స్క్వేర్‌లో ఈ జంట ఇలా పెళ్లి దుస్తుల్లో కనిపించింది. అభివృద్ధి చెందిన అమెరికా దేశపు ప్రజలు ఇలాంటి బాల్య వివాహం పట్ల ఎలా స్పందిస్తారో చూడాలని యూట్యూబ్‌కి చెందిన కాబీ పర్సన్ ఈ ఏర్పాటు చేశాడు, ఈ వరుడు, వధువు ఇద్దరూ నటులే. ఈ జంటని చూసిన న్యూయార్క్ వాసులు నిశ్చేష్టులయ్యారు. కాబీ పర్సన్ ఈ జంటకు ఫొటోగ్రాఫర్‌గా నటించాడు. కనిపించని కెమెరాతో ఆ దారినపోయేవారి హావభావాలను చిత్రించే ఏర్పాటు ముందుగానే చేసుకున్నారు.
చాలామంది మొహంలో అసహ్యం స్పష్టంగా కనిపించింది. ఒక మహిళ కంట్లోంచి నీరు చిప్పిల్లడం కూడా కెమెరాలో కనిపించింది. మరో మహిళ ఆ పాప దగ్గరికి వచ్చి మీ అమ్మ ఎక్కడుంది అని అడిగింది. తను వాళ్లమ్మ వద్ద అనుమతి తీసుకున్నానని అతను చెబుతుంటే ఆమె మరింతగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఇంత చిన్నపిల్లను పెళ్లి చేసుకుని ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగింది. చాలామంది ఆ 65ఏళ్ల వ్యక్తిని ఇలాంటి ప్రశ్నలే వేశారు. పోలీస్‌లకు పట్టిస్తామని కొంతమంది బెదిరిస్తే ఒక వ్యక్తి బలవంతంగా అతడిని ఈడ్చుకువెళతానని గొడవ పెట్టుకున్నాడు. సెక్యురిటీ అతడిని ఆపాల్సి వచ్చింది.
ఇలాంటి వీడియోలను తీసి బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ఎక్కువమంది మాట్లాడేలా చేయాలన్నదే దీని రూపకర్తల ప్రయత్నం. ఫిబ్రవరి 2016 యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచంలోని ప్రతి నలుగురు మహిళల్లో ఒకరికి 18సంవత్సరాల లోపే వివాహం జరుగుతున్నదని తెలుస్తున్నది. బాల్య వివాహాల పట్ల న్యూయార్క్ వాసుల ఆగ్రహం హర్షించదగినది. తల్లిదండ్రులే దగ్గర ఉండి బాల్య వివాహాలు జరిపించే మనదేశంలో అయితే ఎలాంటి స్పందన ఉంటుందో. ఎందుకంటే ఇక్కడ జరిగే బాల్య వివాహాలకు ఆయా ఆడపిల్లలే ధైర్యం చేసి తెగించి బయటకు రావాల్సిందే. చదువుకుంటాం అని ఏడ్చి మొత్తుకుని తమ పెళ్లిని తామే ఆపాల్సిందే. ఇతరులు పట్టించుకోవడం చాలా తక్కువ మరి.