సరబ్ జిత్ సినిమా కోసం ఐశ్వర్య హోం వర్క్
ఇప్పటికే రీఎంట్రీ మూవీ జాజ్బా లో తన మార్క్ చూపించిన ఐశ్వర్య రాయ్… తన రెండో ప్రయత్నంగా మరోసారి తన పంథా ఏంటో చూపిస్తోంది. గ్లామర్ పాత్రలకు దూరంగా…నటించడానికి అవకాశం ఉండే సినిమాల్నే ఎంచుకుంటోంది. మరీ ముఖ్యంగా సినిమా అంతా తన చుట్టూ తిరిగే పాత్రల్ని మాత్రమే సెలక్ట్ చేసుకుంటోంది. ఇందులో భాగంగా సరబ్ జిత్ బయోపిక్ లో నటించేందుకు ఐష్ అంగీకరించిన విషయం అందరికీ తెలిసిందే. పాకిస్థాన్ జైల్లో మగ్గిన సరబ్ జిత్ సింగ్ చెల్లెలి […]
BY admin27 Feb 2016 2:25 AM IST
X
admin Updated On: 27 Feb 2016 4:18 AM IST
ఇప్పటికే రీఎంట్రీ మూవీ జాజ్బా లో తన మార్క్ చూపించిన ఐశ్వర్య రాయ్… తన రెండో ప్రయత్నంగా మరోసారి తన పంథా ఏంటో చూపిస్తోంది. గ్లామర్ పాత్రలకు దూరంగా…నటించడానికి అవకాశం ఉండే సినిమాల్నే ఎంచుకుంటోంది. మరీ ముఖ్యంగా సినిమా అంతా తన చుట్టూ తిరిగే పాత్రల్ని మాత్రమే సెలక్ట్ చేసుకుంటోంది. ఇందులో భాగంగా సరబ్ జిత్ బయోపిక్ లో నటించేందుకు ఐష్ అంగీకరించిన విషయం అందరికీ తెలిసిందే. పాకిస్థాన్ జైల్లో మగ్గిన సరబ్ జిత్ సింగ్ చెల్లెలి పాత్రలో డీ-గ్లామరైజ్డ్ రోల్ లో ఐష్ కనిపించనుంది. ఈ పాత్ర కోసం ఇప్పటికే ఎన్నో ఆర్టికల్స్, పుస్తకాలు చదివిన ఐశ్వర్యరాయ్… ఇప్పుడు తనే సొంతంగా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సరబ్ జిత్ గురించి తెలుసుకునేందుకు…. బోర్డర్ లో పరిస్థితిని అవగతం చేసుకునేందుకు… ఏకంగా ఇండోపాక్ సరిహద్దును ఐష్ సందర్శించింది. అక్కడి పరిస్థితుల్ని ఆకలింపు చేసుకుంది. అక్కడి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లతో మాట్లాడింది. వాళ్ల కోరిక మేరకు సైనికులతో సెల్ఫీలు కూడా దిగింది.
Next Story