ఆ సమయంలో ఆందోళన పెంచే విటమిన్ లోపం!
సాధారణంగా రతుక్రమం మొదలయ్యే ముందు కొంతమంది మహిళల్లో చిరాకు, కోపం, అసహనం లాంటివి ఎక్కువగా ఉంటాయి. ప్రిమెనుస్ట్రువల్ సిండ్రోమ్ కారణంగా అలా జరుగుతుంది. అయితే అలాంటివారు గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏమిటంటే విటమిన్ డి లోపించినపుడు కూడా ఇలా జరుగుతుంది. డి విటమిన్ లోపిస్తే ఆనందాన్ని కలిగించే సెరటోనిన్ అనే హార్మోను ఉత్పత్తి లోపిస్తుంది. సెరటోనిన్ స్థాయి సరిగ్గా ఉంటే అది మనసుని ఉల్లాసంగా ఉంచుతుంది. అలాగే దీనికి డిప్రెషన్ మీద పోరాడే గుణం కూడా ఉంది. అందుకే […]
సాధారణంగా రతుక్రమం మొదలయ్యే ముందు కొంతమంది మహిళల్లో చిరాకు, కోపం, అసహనం లాంటివి ఎక్కువగా ఉంటాయి. ప్రిమెనుస్ట్రువల్ సిండ్రోమ్ కారణంగా అలా జరుగుతుంది. అయితే అలాంటివారు గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏమిటంటే విటమిన్ డి లోపించినపుడు కూడా ఇలా జరుగుతుంది. డి విటమిన్ లోపిస్తే ఆనందాన్ని కలిగించే సెరటోనిన్ అనే హార్మోను ఉత్పత్తి లోపిస్తుంది. సెరటోనిన్ స్థాయి సరిగ్గా ఉంటే అది మనసుని ఉల్లాసంగా ఉంచుతుంది. అలాగే దీనికి డిప్రెషన్ మీద పోరాడే గుణం కూడా ఉంది. అందుకే సరైన స్థాయిలో విటమిన్ డి లేకపోవడం వలన కూడా ఈ సమయంలో మహిళలు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే దీని లోపంతో తలెత్తే మరికొన్ని సమస్యలు ఇవి-
- రాత్రులు నిద్రపట్టదు. పగలు ఎక్కువగా నిద్రపోతుంటారు.
- విటమిన్ డి లోపిస్తే క్రీడాకారుల్లో శక్తి తగ్గుతుంది. వ్యాయామం చేయలేరు, అశక్తత, నీరసం ఆవహిస్తాయి.
- గుండె ఆరోగ్యంలో విటమిన్ డి ప్రధాన పాత్రని పోషిస్తుంది. ఇది సరిపడా లేకపోతే రక్తపోటు సక్రమంగా ఉండదు.
- ఎముకలు పెరగాలన్నా, బలంగా ఉండాలన్నా విటమిన్ డి అత్యవసరం. ఇది లేకపోతే ఎముకలు బలహీనపడటం, విరగటం సర్వసాధారణంగా జరుగుతాయి. విటమిన్ డి లోపం ఉంటే ఇలాంటి రిస్క్‌లు దాదాపు రెట్టింపు స్థాయిలో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
- విటమిన్ డి లోపిస్తే శరీరంలో ఉన్న నొప్పులు మరింత బాధాకరంగా మారతాయి.
- ఇది లోపిస్తే మహిళలు డిప్రెషన్ బారిన పడే అవకాశాలు రెండింతలు అవుతాయి.